Kids

అన్నప్రాసన ఏ వయస్సులో చేయాలి?

అన్నప్రాసన ఏ వయస్సులో చేయాలి?

అన్నప్రాసన అంటే పుట్టిన శిశువుకు మొదటిసారి అన్నము తినిపించే కార్యక్రమం. ఇందుకు శిశువు జాతకచక్ర ఆధారంగా తారబలం చూసి ముహూర్తం నిర్ణయిస్తారు. ఇది హిందు సంప్రదాయంలో కనిపించే ఒక పెద్ద కుటుంబ పండుగ. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయి.
**అన్నప్రాసన చేయడానికి..
మగపిల్లలకు సరిమాసాలలో (6, 8, 10, 12) చేయాలి. ఆడపిల్లలకు బేసి మాసలలో (5,7,9,11) చేయాలి. లగ్న శుద్ధి, దశమ శుద్ది వృషభ, మిధు, కటక, కన్య, ధనుస్సు, మీన రాసుల లగ్నములలో చేయాలి. ముందుగా గణపతి పూజ చేసి తర్వత విష్ణుమూర్తిని, సూర్య, చంద్రులను అష్టదిక్పాలకులను, కుల దేవతను భూదేవిని పూజించి కార్యక్రమం ప్రారంభించాలి.ఈ కార్యక్రమం జరపడానికి శాస్త్రం సూచించిన నియమాలు పాటించాలి. అన్నప్రాసన ముహూర్త ప్రభావం శిశువు జీవితం, ఆరోగ్య విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందువలన తప్పకుండా మంచి ముహూర్తానికే అన్నప్రాశన చేయాలి.
***?అనుకూల వారములు
సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలం. తప్పనిసరైతే శని ఆదివారాలలో చేయవచ్చును.
**అనుకూల తిధులు
శుక్లపక్ష తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిధులయందు అన్నప్రాశన మంచిది. అవసరమైతే బహూళ పక్షమిలో ఈ తిధులలో చేయవచ్చును.
**అనుకూల నక్షత్రాలు
అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, శ్రవణం, ధనిష్ఠ,శతభిషం నక్షత్రముల రోజున మంచిది.
**శుభ లగ్నసమయం
వృషభ, కర్కాటక, మిధున, కన్య, ధనస్సు, మీన లగ్నమందు, ముహూర్థమునకు లగ్నం నుండి దశమ స్థాన శుద్ధి, అష్టమ స్థాన శుద్ధి ఉండాలి. శుద్ది అంటే దశమంలో, అష్టమంలో ఏ గ్రహాలు ఉండరాదని అర్ధం. లగ్నానుండి నవమంలో బుధుడు, అష్టమంలో కుజుడు సప్తమంలో శుక్రుడు లేకుండా ముహూర్తం ఉండాలి.
**అన్నప్రాసన చేయు విధానం
శుక్లపక్షమి రోజులలో అన్నప్రాశన ఉదయం పూట మాత్రమే చేయుట ఉత్తమం.
శిశువునకు కొత్త బట్టలు తొడిగి (పరిస్థితులను బట్టి) మేనమామ, మేనత్త కాని తల్లిదండ్రులు కాని తూర్పు ముఖముగా చాప లేదా పీటలపై కూర్చోవాలి.
*శిశువును తల్లి లేద మేనత్త ఒడిలో ర్చోబెట్టుకోవాలి. బంగారము, వెండి, కంచు మొదలగు పాత్రలో ఏర్పాటు చేసుకున్ననెయ్యి, తేనె, పెరుగులను ముద్దగా తండ్రి లేక మేనమామ కుడిచేతిలో బంగారు ఉంగరాన్ని పట్టుకుని ఆ పాత్రలోని నెయ్యి, తేనె, పెరుగులను ఉంగరం సహయంతో శిశువునకు తినిపించాలి. వసతి, స్థోమతలను బట్టి బంగారు లేక వెండి స్పూన్‌లను కూడ ఉపయోగించుకోవచ్చును. ఆ తర్వతనే అన్నం తినిపించాలి.
ఇలా మూడుసార్లు తినిపించిన తరువాత నాలుగోసారి చేతితో అన్నాన్ని తినిపించవలెను. ఆ తరువాత తల్లి, మేనమామ మిగతా కుటుంబ పెద్దలు అదే పద్ధతిలో చేయాలి. అన్నప్రాశన సమయంలో దేవుని సన్నిధిలో బంగారునగలు, డబ్బు, పుస్తకము, పెన్ను, కత్తి, పూలు మొదలైన వస్తువులు పెట్టి శిశువును ఈ వస్తువులకు దగ్గరగా కూర్చోబెడతారు. అమర్చిన వస్తువులలో శిశువు మొదటిసారిగా ఏ వస్తువు తాకునో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి ఆ శిశువుకు ఉంటుందని భావన చెందుట ఒక సాంప్రదాయంగా వస్తుంది.
**ముఖ్యాంశం
అన్నప్రాశన మూహూర్త లగ్నంలో రవి ఉన్న యెడల కుష్ఠు రోగి గాను, క్షీణ చంద్రుడు ఉన్న దరిద్రుడి గాను, పూర్ణ చంద్రుడు ఉన్న అన్నదాత గాను, కుజుడున్న పైత్యా రోగి గాను, బుద్ధుడున్న విశేష జ్ఞాన వంతుడిగాను, గురువున్న భోగ మంతుడుగాను, శుక్రుడున్న దీర్ఘాయువు గలవాడు గాను, శని ఉన్న వాత రోగము కలవాడు గాను, రాహు కేతువులు ఉన్న దరిద్రుడు అగును అని కాలామృత గ్రంధంలో తెలియజేయబడినది.ముహూర్త సమయానికి లగ్నానికి ఏ పాపగ్రహ సంబంధం లేకుండా ముహూర్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తొలిసారి అన్నం తింటున్న శిశువునకు జాతకచక్ర ఆధారంగా అనుభవజ్ఞులైన పండితుల దగ్గరకు వెళ్లి వారికి దక్షిణ తాంభూలాదులు ఇచ్చి శుభమూహూర్తంను అడిగి తెలుసుకుని పండితుడు నిర్ణయించిన శుభమూహూర్తాన అన్నప్రాసన చేయడం బిడ్డకు శ్రేయస్సు,యశస్సులు కలుగుతాయి.