NRI-NRT

భారతీయ అమెరికన్లే విద్యాధికులు

భారతీయ అమెరికన్లే విద్యాధికులు

ప్రపంచ దేశాల్లోని పలువురు విద్యార్థులు, ఉద్యోగ, వ్యాపారులకు అమెరికా వెళ్లాలన్నది కల. దాన్ని నెరవేర్చుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ, వెళ్లిన వారిలో అంతా ఆర్థికంగా స్థితిమంతులు కాలేరు. భారతీయులు మాత్రం ఆదాయంలో ఎక్కడా తగ్గడం లేదు. వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారిలో భారతీయుల సగటు ఆదాయం అందరికంటే అధికంగా ఉండటం.. వివిధ రంగాల్లో మనోళ్లకున్న ప్రతిభాపాటవాలకు నిదర్శనం. ఏటా అక్కడి ప్రభుత్వం అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే నిర్వహిస్తుంది.
*అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్న స్థానికులు, విదేశీయుల మధ్యస్థ కుటుంబాల ఆదాయ వివరాలు నమోదుచేస్తుంది. అందులో వివిధ దేశాల నుంచి వచ్చినవారి గణాంకాలూ పొందురుస్తారు. ఈ వివరాల ప్రకారం.. అక్కడ స్థిరపడ్డ ఇండియన్‌ అమెరికన్ల ఆదాయం ఏటా అందరికంటే 1,00,500 డాలర్లుగా నమోదైంది. పొరుగు దేశాలైన శ్రీలంక.. నాలుగు, చైనా.. ఏడు, పాకిస్తాన్‌ .. ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మొత్తం మీద టాప్‌ 10 దేశాల్లో తొమ్మిది ఆసియా దేశాలే కాగా.. స్థానికులు ఏకంగా 9వ స్థానంలో నిలవడం విశేషం.
**అమెరికాలో స్థిరపడిన వివిధ దేశాల మధ్యస్థ(మధ్య తరగతి) కుటుంబాల ఆదాయం ఏటా..
ఇండియన్‌ 1,00,500
ఫిలిప్పో 83,300
తైవానీస్‌ 82,500
శ్రీలంకన్‌ 74,600
జపనీస్‌ 72,300
మలేసియన్‌ 70,300
చైనీస్‌ 69,100
పాకిస్తాన్‌ 66,200
వైట్‌–అమెరికన్లు 59,900
కొరియన్‌ 59,200
ఇండోనేసియన్‌ 57,500
స్థానిక–అమెరికన్లు 56,200
థాయ్‌లాండ్‌ 55,000
బంగ్లాదేశీ 50,000
నేపాలీ 43,500
లాటినో 43,000
ఆఫ్రికన్‌ –అమెరికన్లు 35,000
**భారతీయులు బుద్ధిమంతులే కాదు, విద్యావంతులు కూడా. అమెరికాలో స్థిరపడుతున్న విదేశీయుల్లో బ్యాచ్‌లర్‌ డిగ్రీ ఉన్న వారిలోనూ ఇండియన్లే నంబర్‌వన్. ఈ విషయంలో అమెరికన్లు 28 శాతంతో ఆఖరిస్థానంలో నిలవడం గమనార్హం.
ఇండియన్‌ – అమెరికన్లు 70 %
కొరియన్‌ – అమెరికన్లు 53 %
చైనీస్‌ – అమెరికన్లు 51 %
ఫిలిప్పో – అమెరికన్లు 47 %
జపనీస్‌ – అమెరికన్లు 46 %
సగటు అమెరికన్లు 28 %