Movies

ఇలియానా వెబ్ సిరీస్

ఇలియానా వెబ్ సిరీస్

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ ఇలా సినీ ఇండిస్టీలోని హీరోయిన్లు చాలా వరకు వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు సిద్దం అవుతున్నారు. ఆఫర్లు లేని హీరోయిన్స్‌కు ఇప్పుడు ఓటీటీ అనేది చాలా మందికి ఛాన్స్‌గా మారింది. గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్‌లో ఆఫర్లు లేక సౌత్‌ వైపు చూసింది. ఇక్కడ నుండి కూడా ఆమెకు ఎలాంటి ఛాన్స్‌ రాలేదు. దీంతో బాలీవుడ్‌ స్టార్‌ అజయదేవగన్‌కు జోడీగా ఒక వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇంగ్లీష్‌లో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ దక్కించుకున్న ‘లూథర్‌’ టీవీ సీరీస్‌ను హిందీలో రీమేక్‌ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడీ అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్‌ ఫిల్మ్‌ స్టార్స్‌ హతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాక్షి సిన్హా వంటి వారు వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు సిద్దం అయ్యారు. ఇప్పుడు దేవగన్‌, ఇలియానా కూడా ‘లూథర్‌’ రీమేక్‌లో నటించబోతున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ను అతి త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇండియన్‌ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పలు చేర్పులు చేస్తూ స్క్రిప్ట్‌ను రెడీ చేశారట. ఈ వెబ్‌ సిరీస్‌తో అయినా ఇలియానా మళ్లీ బాలీవుడ్‌ లేదా సౌత్‌లో బిజీ అవుతుందేమో చూడాలి.