WorldWonders

నెలరోజుల్లో ఒకే పాము ఎనిమిది సార్లు కాటు వేసినా…

నెలరోజుల్లో ఒకే పాము ఎనిమిది సార్లు కాటు వేసినా…

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తనను ఒకే పాము ఎనిమిది సార్లు కరిచిందని అంటున్నాడు. ఒక్క నెలలోనే ఆ పాము అతన్ని ఇన్నిసార్లు కాటేసినా.. అతడు బతికి బట్టకట్టడం ఓ అద్భుతమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎవరతను, అతని వివరాలేంటో చూద్దామా.. బస్తీ జిల్లా, రామ్‌పూర్‌కు చెందిన యశ్‌రాజ్‌ మిశ్రా పాముకాటుతో ఒకే నెలలోఎనిమిది సార్లు ఆస్పత్రి మెట్లు ఎక్కాడు. ఆ పాము చివరిగా తనను వారం రోజుల క్రితం కరిచినట్టు చెబుతున్నాడు. బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీని కోసం పాములు పట్టుకునే వారి సాయం తీసుకోవడం గమనార్హం.