Movies

బాహుబలి తల్లిగా భాగ్యశ్రీ

బాహుబలి తల్లిగా భాగ్యశ్రీ

భాగ్యశ్రీ… ఓ ముప్ఫై సంవత్సరాల కిత్రం ఈ పేరు ఓ సంచలనం! సల్మాన్ఖాన్ ‘మైనే ప్యార్ కియా’తో కథానాయికగా ఆమె పరిచయం కావడం, ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో రాత్రికి రాత్రి ఆమె స్టార్ కావడం చకచకా జరిగాయి. తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా విడుదలైన ‘మైనే ప్యార్ కియా’ ఇక్కడా విజయం సాధించింది. తర్వాత రాజశేఖర్ ‘ఓంకారం’, నందమూరి బాలకృష్ణ ‘రాణా’ చిత్రాల్లో ఆమె కథానాయికగా నటించారు. మళ్లీ ఇప్పుడు, సుమారు ఇరవైయేళ్ల తర్వాత భాగ్యశ్రీ తెలుగులో నటిస్తున్నారు.ప్రభాస్ కథానాయకుడిగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమకథా చిత్రంలో హీరో తల్లిగా ఆమె నటిస్తున్నారు. ‘‘భాగ్యశ్రీ అద్భుతమైన నటి. మా చిత్రంలో ఆమె నటిస్తుండడం గొప్పగా భావిస్తున్నాం. ప్రభా్సకు తల్లిగా ఆమె నటిస్తున్నారు. వాళ్ల మధ్య సన్నివేశాలు ఇంటెన్స్గా ఉంటాయి’’ అని రాధాకృష్ణ కుమార్ అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది.