Food

బ్రేక్‌ఫాస్ట్ బాగా చేస్తే సంసారంలో స్వర్గం చూస్తారంట!

బ్రేక్‌ఫాస్ట్ బాగా చేస్తే సంసారంలో స్వర్గం చూస్తారంట!

వావ్.. ఈ బ్రేక్‌ఫాస్ట్ తినేవారు సెక్స్‌లో స్వర్గం చూపిస్తారట!

బహుశా.. మీరు ఈ బ్రేక్ ఫాస్ట్ గురించి ఇప్పటివరకు విని ఉండరు. దీని ప్రత్యేకతలు తెలిస్తే.. తప్పకుండా ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో మిస్ కాకుండా తీసుకుంటారు. అదేంటో చూసేయండి మరి.

శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో.. సెక్స్ కూడా అంతే ముఖ్యం. సెక్స్ వల్ల హార్మోన్లు ఉత్తేజితమై ఆరోగ్యం మెరుగవుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంచడంలో సెక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. మంచి సెక్స్ లైఫ్ ఉండే వ్యక్తులు.. తమ వృత్తిలో కూడా మంచి వృద్ధి సాధిస్తారట. అయితే, మంచి సెక్స్ లైఫ్ కావాలంటే.. మాంచి పార్టనర్ ఉంటే సరిపోదు. వారిని సుఖ పెట్టగలిగే సామర్థ్యం కూడా ఉండాలి. లేకపోతే.. సమస్య జఠిలమై మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఆ సమస్య రాకూడదంటే.. తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. శరీరానికి మంచి వ్యాయామం ఉండాలి. అలాగే.. బ్రేక్ ఫాస్ట్‌ను అస్సలు మిస్ కాకూడదు. ఒక వేళ మిస్ చేస్తే.. మీ మిస్‌తో మాంచి సెక్స్ అనుభవాన్ని మిస్ అవుతున్నట్లే. అదెలా అనుకుంటున్నారా? అయితే, బ్రిటన్‌లో నిర్వహించిన ఈ స్టడీ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

‘వీటాబిక్స్’ అనే సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో.. సెక్స్ స్టామినా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్‌లో ఎలాంటి ఆహారం తీసుకుంటే.. ఎక్కువ సేపు సెక్స్‌లో రాణిస్తారనే విషయం గురించి సుమారు 2 వేల మందిపై సర్వే జరిపారు. వారు ఎక్కువగా తీసుకొనే ఆహారం, సెక్స్, ఆరోగ్యం తదితర విషయాలతోపాటు ఎంత మంది ఉదయం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ చేస్తారు? ఎంతమంది చేయరు అనే అంశాలను కూడా అడిగి తెలుసుకున్నారు.

సర్వేలో ఎక్కువ మంది జీవితంలో బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా ముఖ్యమని అంగీకరించారు. కొందరు మాత్రం తాము బ్రేక్ ఫాస్ట్‌‌కు బదులు టీ, కాఫీలను తాగి సరిపెట్టుకుంటామని చెప్పారు. ఇక సెక్స్ స్టామినా విషయానికి వస్తే.. పీనట్ బటర్ (వేరుశెనగ, వెన్న కలిపి దీన్ని తయారు చేస్తారు) తినేవారు తమ పార్టనర్‌తో ఎంతో ప్రేమగా మెలుగుతారని, ముఖ్యంగా సెక్స్‌లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు. వీరితో సెక్స్ అంటే స్వర్గంలో విహరించినట్లే ఉంటుందని చెప్పారు.

పీనట్ బటర్‌తో ఇంకా ఎన్నో ప్రయోజనాలు…: పీనట్ బటర్ కేవలం సెక్స్ స్టామినా మాత్రమే కాదండోయ్.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

బరువు తగ్గుతారు: బరువు తగ్గాలని అనుకొనేవారికి ఇది మంచి డైట్. దీనివల్ల శరీరానికి 180 నుంచి 210 కేలోరీలు అందుతాయి. దీంతో ఆకలి అస్సలు వేయదు. ఫలితంగా అతిగా ఆహారం తీసుకొనే అలవాటు తగ్గి బరువు తగ్గుతారు. అయితే, దీన్ని 2.6 గ్రాముల చొప్పునే తీసుకవాలి. అంతకు మించి తీసుకుంటే సీన్ రివర్స్ అవుతుంది.

గుండెకు మంచిది: పీనట్ బటర్ గుండెకు మేలు చేస్తుంది. ఇందులోని పి-కౌమారిక్ యాసిడ్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే అసంతృప్త కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి. గుండె సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా మంచిది.

క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడుతుంది: పీనట్ బటర్ ఉండే విటమిన్-E ఉదరం, ఊపిరితీత్తులు, కాలేయం, పేగు తదితర క్యాన్సర్లను నివారించేందుకు ఉపయోగపడతాయి. అల్జిమర్స్, న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు, పిత్తాశయ రాళ్ళు, టైప్-2 మధుమేహం ముప్పు నుంచి కూడా ఇది కాపాడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరానికి మేలు చేస్తాయి. జిమ్‌లో కండల కోసం కసరత్తులు చేసేవారికి కూడా ఇది మంచిది. చూశారుగా.. పీనట్ బటర్ మన ఇండియాలో కూడా అందుబాటుటో ఉంటుంది. ఈ వైరస్ కాలంలో బయటకు వెళ్లడం రిస్క్ కాబట్టి.. ఆన్‌లైన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండండి.. ఆరోగ్యంగా జీవించండి.