WorldWonders

సింహాచలం అప్పన్న సాక్షిగా ₹1.4కోట్లకు టొకరా!

సింహాచలం అప్పన్న సాక్షిగా ₹1.4కోట్లకు టొకరా!

అప్పన్న బంగారం పేరిట రూ.1.44 కోట్లకు టోకరా

బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసినట్లుగా శ్రావణి.. ఏఈవోకి పంపించిన బిల్లు

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం బంగారాన్ని విక్రయిస్తున్నట్టుగా నమ్మించి రూ.1.44 కోట్లకు టోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలివీ..

జూలై నెలలో అప్పటి ఈవో డి.భ్రమరాంబకు ఒక ఫోన్‌ వచ్చింది. తన పేరు ఎం.శ్రావణి అని, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన తాను దేవస్థానం వద్ద రూ.1.44 కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేశానని, ఎప్పుడు ఇస్తారని అడిగింది. కంగుతిన్న ఈవో భ్రమరాంబ ఆలయ ఏఈవో పి.రామారావు ఫోన్‌ నంబర్‌ను శ్రావణికిచ్చి పూర్తి వివరాలు ఆయనకు తెలియజేయాలని సూచించారు.
శ్రావణి.. ఏఈవోకి ఫోన్‌ చేసి తాను సింహాచలం కొండపై ఉంటున్న కోన హైమావతి అనే మహిళ ద్వారా దేవస్థానం బంగారం అమ్ముతోందని తెలుసుకుని ఆమెకు రూ.1.44 కోట్లు ఇచ్చి బంగారం కొనుగోలు చేశానని చెప్పింది. ఆ బంగారాన్ని తనకు ఎప్పుడు అప్పగిస్తారని అడిగింది. దేవస్థానం బంగారం అమ్మకాలు ఏమీ చేయదని ఏఈవో చెప్పారు.