DailyDose

వ్యభిచార వెబ్‌సైట్లో భార్య ఫోటోలు పెట్టిన ఘనుడు-నేరవార్తలు

వ్యభిచార వెబ్‌సైట్లో భార్య ఫోటోలు పెట్టిన ఘనుడు-నేరవార్తలు

* వ్యభిచార వెబ్‌సైట్లో భార్య ఫోటోలు… ప్రియురాలితో కలిసి నీచానికి పాల్పడిన భర్త!తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భార్యపై కక్ష తీర్చుకునేందుకు ఆమె నగ్న ఫోటోలను అశ్లీల వెబ్‌సైట్లో భర్త పోస్ట్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి భార్యను వదిలించుకునేందుకు నీచానికి పాల్పడ్డాడు. భార్య పరువు తీయాలన్న ఉద్దేశంతో ఆమె నగ్న చిత్రాలను పోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసి ఫోన్ నంబర్‌ సైతం పోస్ట్ చేశాడు. దీంతో ఆమెకు అపరిచిత వ్యక్తుల నుంచి అనేక ఫోన్‌కాల్స్ రావడం మొదలైంది. దీంతో విసుగెత్తిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.మహారాష్ట్ర రాజధాని ముంబయికి చెందిన దిలీప్(పేరు మార్చాం) ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం సైనా(పేరు మార్చాం) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఈ క్రమంలోనే దిలీప్‌కి అదే హోటల్‌లో పనిచేసే మహిళా ఉద్యోగితో సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. ఇద్దరూ హోటల్‌లోనే పనిచేస్తుండటంతో వీలు చిక్కినప్పుడల్లా ఖాళీగా ఉన్న గదుల్లో రాసలీలలు సాగించేవారు. ఈ విషయం కొద్దిరోజులకు సైనాకు తెలియడంతో భర్తను నిలదీసింది. దీంతో దిలీప్‌ ఆమెను వేధించగా సైనా పోలీసులకు పిర్యాదు చేసింది.దీంతో భార్యపై కక్షగట్టిన దిలీప్ ఆమె పరువు తీయాలని కుట్ర పన్నాడు.వ్యభిచారం నిర్వహించే ఓ ముఠాకు చెందిన వెబ్‌సైట్లో తన భార్య నగ్న చిత్రాలు అప్‌లోడ్ చేశాడు. పడక సుఖం కావాలంటే ఫోన్ చేయాలంటూ ఆమె ఫోన్ నంబర్‌ పోస్ట్ చేశాడు. దీంతో అనేక మంది సైనాకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడింది ఆమె భర్త దిలీప్ అని గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు.

* గండేడ్ మండ‌లంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు జ‌న్మించ‌డంతో త‌ట్టుకోలేక‌ ఆ శిశువుల‌కు విష‌మిచ్చాడో కసాయి తండ్రి. దేశాయిపల్లికి చెందిన కృష్ణ‌వేణి, కేశ‌వులు దంప‌తుల‌కు ఈ నెల 1న క‌వ‌ల ఆడ‌పిల్ల‌లు జ‌న్మించారు. అప్ప‌టికే వారికి ఒక కూతురు ఉంది. రెండో కాన్పులోనూ క‌వ‌ల ఆడ‌శిశువులే పుట్టార‌ని ఆవేద‌న చెందిన కేశవులు.. ఇద్దరు శిశువుల‌కు పురుగుల మందు తాగించాడు. మెరుగైన చికిత్స కోసం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే కేశ‌వులు పురుగుల మందు డ‌బ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో న‌మోద‌య్యాయి.

* భాకరాపేట లోని శేషాచలం అడవుల్లో అక్రమంగా తరలిస్తున్న 19 ఎర్ర చందనం దుంగలను టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది.ఒక తమిళ స్మగ్లర్ ను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డిఎస్పీ వెంకటయ్య తెలిపారు. తనకుఅందిన సమాచారంతో ఈ ప్రాంతానికి ఆర్ ఎస్ ఐ వాసు టీమ్ శ్రీవారి మెట్టు నుంచి కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం ఉదయం భాకరాపేట వద్ద దాదాపు 20 మంది ఎర్రచందనం దుంగలను మోసుకుంటూ రావడం కనిపించింది. వాసు టీమ్ వారిపై దాడి చేయడానికి ప్రయత్నించగా ఒక స్మగ్లర్ ను పట్టుకున్నారు ఇతను తిరువన్నామలై జిల్లా పోలూరుతాలూకా కు చెందిన శేఖర్ గా గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం ఇతని ద్వారా ప్రయత్నిస్తున్నారు. వీరు పది రోజుల క్రితం వచ్చి కొన్ని దుంగలను రవాణా చేసినట్లు విచారణలో తెలిసింది.

* సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ అల్లాబక్ష్ ఆధ్వర్యంలో ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు జరిపిన దాడుల్లో 8లక్షలు 30వేల 40రూపాయలు పట్టుబడింది. అయితే అందులో రూ.4లక్షలు భాస్కర రెడ్డి కి చెందిన చలాన ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ అల్లాబక్ష్ తెలిపారు.ఇదిలా ఉండగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 13మంది వరకు స్టాంపు వెండర్లు ఉండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం తెలియజేయనున్నట్లు డిఎస్పీ అల్లాబక్ష్ తెలిపారు. ఈ దాడుల్లో సిఐలు ప్రసాద్ రెడ్డి, నాగేంద్ర, ఎస్ ఐ లు విష్ణు వర్దన్,శ్రీనివాసులు,ఏఎస్ఐలు నాగరాజు, హెడ్ కానిస్టేబుల్స్ రవి, జ్యోతి ప్రసాద్, బాబు, నరేంద్ర, పిసిలు శ్రీనివాసులు, రవీంద్ర, సారధి, ఎం. రాజేష్, ఆర్. రాజేష్, భాస్కరరెడ్డి, రమేష్, ఓబులేషు పాల్గొన్నారు.

* భార్యను వదిలేసి అమ్మాయిలతో జల్సాలు… రోడ్డుపైనే భర్తనుతనను మోసం చేసిన భర్త ఇతర అమ్మాయిల జీవితాలతో కూడా ఆడుకుంటుండటాన్ని గమనించిన భార్య అతడిని నడిరోడ్డుపైనే చితకబాదింది.మాయమాటలతో అమ్మాయిలను లోబరుచుకుని లైంగికంగా దోచుకుంటున్న కామాంధుడికి అతడి భార్యే తగిన బుద్ధి చెప్పిన ఘటన కరీంనగర్ పట్టణంలో జరిగింది. కరీంనగర్‌కు చెందిన సంపత్ అనే వ్యక్తి ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నాడు. మానకొండూరుకు చెందిన ఓ యువతి గతంలో అక్కడే పనిచేసేది. ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకున్న సంపత్ తప్పని పరిస్థితుల్లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయినప్పటికీ ప్రవర్తన మానుకోని ఆ కామాంధుడు షాపింగ్ మాల్ పనిచేసే ఇతర అమ్మాయిలతో చనువుగా ఉండేవాడు. మాయమాటలు చెప్పి కొందరిని లైంగికంగా దోచుకున్నాడు.

* ఏసీపీ బాలు జాదవ్ కన్నుమూత. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీళ్ళచెరువు వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.