Fashion

మీకు నరాల బలహీనతా? సోయాపాలు తాగండి.

మీకు నరాల బలహీనతా? సోయాపాలు తాగండి.

ఆరోగ్యం విషయంలో ఇటీవలికాలంలో పెరిగిన అవగాహన వల్ల సోయా ఉత్పత్తులకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. వీటిలో సోయాపాలదే అగ్రస్థానం. సోయాపాలు కేవలం మేలైన ఆహారంగానే గాక పలు అనారోగ్య సమస్యలకు ఔషధమని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో చక్కెర, క్యాలరీల సంఖ్య తక్కువ గనుక ఒక రకంగా ఇవి వెన్నతీసిన పాలతో సమానం. అందుకే బరువు తగ్గాలనుకునే వారు నిరభ్యంతరంగా సోయాపాలు తీసుకోవచ్చు. సోయాపాల వినియోగం వల్ల కలిగే మరిన్ని ఉపయోగాలివే..ఇతర పాలు, ఇతర పప్పు ధాన్యాల కంటే సోయాపాలలో మాంసక త్తులు ఉంటాయి కనుక శరీరానికి మంచి శక్తి లభిస్తుంది.సోయా పాలల్లో విరివిగా ఉండే ఫ్యాటీ ఆమ్లాలూ, పీచు, విటమిన్లు, ఖనిజలవణాలు శరీరానికి తగిన శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తాయి. సోయాపాలలోని మోనో, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించేందుకు తోడ్పడతాయి. సోయాపాలలోని ఒమెగా 3, 6 ఫ్యాటీఆమ్లాలు, శక్తిమంతమైన ఫైటో – యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడటమే గాక హానికారక ఫ్రీరాడికల్స్‌ వల్ల కలిగే ముప్పును నియంత్రిస్తాయి. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులబారి నుంచి రక్షణ లభిస్తుంది. సోయాపాలలోని పీచు అమితమైన ఆకలిని తగ్గిస్తుంది గనుక అధిక బరువు సమస్య రాదు. మెనోపాజ్‌ వయసు మహిళల్లో ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గి సులభంగా హ ద్రోగాల బారిన పడుతుంటారు. వీరు ముందునుంచే సోయాపాలు తీసుకుంటే అందులోని ఫైటోఈస్ట్రోజెన్‌.. ఆ హార్మోను లోపాన్ని సవరించి పై సమస్యలు రాకుండా చేస్తుంది. సోయాపాలలోని ఫైటోఈస్ట్రోజెన్‌ ఎముకలకు తగిన క్యాల్షియం అందించి .ఆస్టియోపోరోసిస్‌ రాకుండా చేస్తుంది. నరాల బలహీనత, నిస్సత్తువ, మానసిక ఒత్తిళ్ల బాధితులు సోయా పాలు వాడితే ఉపశమనం కలుగుతుంది. జుట్టు కుదుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే మాంసక త్తులు అధికంగా ఉండే గుడ్లు, చేపలు తిననివారు సోయాపాలు తీసుకుంటే అందులోని లైసిన్‌, అమినో ఆమ్లం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.