DailyDose

కరోనాపై WHO షాకింగ్ నిర్ణయం-TNI బులెటిన్

కరోనాపై WHO షాకింగ్ నిర్ణయం-TNI బులెటిన్

* తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదలగడిచిన 24 గంటల్లో 2478 కొరొనా పాజిటివ్ కేసులు నమోదుమొత్తం ఇప్పటి రాష్ట్రంలో 1 35 884 కొరొనా కేసులు నమోదుకొత్తగా 10 మరణాలు 866 కి చేరిన మరణాల సంఖ్యమొత్తం ఆక్టీవ్ కేసులు 32 994 కొరొనా కేసులుగడిచిన 24 గంటల్లో 43 245 శాంపిల్స్ కలెక్ట్ చేయగా 2 274 పెండింగ్ లో ఉన్నాయిఘంఛ్- 267, కరీంనగర్- 129, ఖమ్మం 128, మేడ్చెల్- 190, నల్గొండ- 135, రంగారెడ్డి- 171, సిద్దిపేట- 82, వరంగల్ అర్బన్- 92 కేసులు నమోదుప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ 25 730 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడి.

* అసలే ఇది కరోనా కాలం.. ప్రజలంతా భయంతో వణికిపోతున్న సమయం. ఇలాంటి విపత్కర సమయంలో జనం భయాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించాడో వైద్యుడు, అతడి సహాయకుడు. తమ వద్దకు కరోనా పరీక్షల కోసం వచ్చే వారికి నకిలీ రిపోర్టులు ఇచ్చి మోసగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడిన ఇద్దరు ప్రబుద్ధులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితులు దిల్లీలోని మాలవీయనగర్‌కు చెందిన వైద్యుడు కుష్‌ బిహారి పరాశర్‌, అతడి సహాయకుడు అమిత్‌ సింగ్‌గా గుర్తించినట్టు ‌ పోలీసులు తెలిపారు.

* ప్రపంచదేశాలతోపాటు అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి కకావికలం చేస్తోంది. దీన్ని ఎదుర్కోవడంలో భాగంగా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ముమ్మర కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ నాటికే అమెరికాలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభిస్తామని అమెరికా అధికారులు పేర్కొంటుండగా డబ్ల్యూహెచ్‌ఓతో పాటు అంతర్జాతీయ నిపుణులు తొందరపడవద్దని సూచిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికాలో ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, వ్యాక్సిన్‌ అనుమతులపై అమెరికా నియంత్రణ సంస్థలపై రాజకీయ ఒత్తిడి పెరిగిందనే వాదనలు తాజా చర్చకు దారితీశాయి.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా విస్తృత వ్యాక్సినేషన్‌ను 2021 మధ్యకాలం వరకు చూస్తామని తాము భావించడంలేదని ఆ సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్‌ హ్యారిస్‌ అన్నారు. శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ఆమె.. ఆయా ఔషధ సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు కరోనా నుంచి కాపాడేందుకు ఏమేర ప్రభావం చూపుతాయో, ఎంతవరకు భద్రతను కల్పిస్తాయో తదితర అంశాలను సునిశితంగా పరిశీలించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వ్యాక్సిన్ల మూడో దశ ప్రయోగాలకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. ఎందుకంటే నిజంగానే ఆ వ్యాక్సిన్లు కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయా? ఏమేరకు సురక్షితం? తదితర అంశాలను జాగ్రత్తగా చూడాల్సి ఉంటుందని చెప్పారు.