Agriculture

కీసర అవినీతి ఎమ్మార్వో ఇచ్చిన పాసుపుస్తకాలు రద్దు

కీసర అవినీతి ఎమ్మార్వో ఇచ్చిన పాసుపుస్తకాలు రద్దు

కీసర ఎమ్మార్వో వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.. ఏకంగా రూ.కోటి 10లు లంచం తీసుకుంటూ పట్టుబడంతో.. ఆయనను.. ఆయనకు లంచం ఇచ్చినవాళ్లను కూడా అరెస్ట్ చేసింది ఏసీబీ… ఇక, వాళ్లను కస్టడీలోకి తీసుకుని కూడా కీలక విషయాలను రాబట్టింది. ఈ విచారణలో ఇతర ఉన్నతాధికారుల పేర్లు కూడా బయటకు వచ్చాయని.. వాళ్లకు నోటీసులు జారీ చేసి విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. కీసర రెవెన్యూ పరిధిలో ఎమ్మార్వోగా నాగరాజు జారీచేసిన పట్టాపాసు పుస్తకాలను అన్నీ రద్దు చేయాలని ఆదేశించారు మేడ్చల్ – మల్కాజ్‌గిరి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు… నాగరాజు జారీచేసిన పట్టాపాసు పుస్తకాలను రద్దు చేయడంతో పాటు.. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. ఈ పరిణామం సాధారణ రైతులకు కాస్త ఇబ్బందిగా మారగా.. అక్రమార్కుల్లో మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కాగా, ఎమ్మార్వో నాగరాజు.. కలెక్టర్‌పై కూడా ఆరోపణలు చేసినట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.