Fashion

ముక్కుపుడకతో స్లిమ్‌గా కనిపిస్తారు

పెండ్లి.. పేరంటం ఏదైనా.. అందంగా ముస్తాబవుతేనే అందం.. పై నుంచి కింద వరకు నగలు దిగేసినా.. చాలామంది ముక్కుపుడకను మాత్రం పెద్దగా పట్టించుకోరు..ఒక్కసారి ఆ ముక్కెర ఎంత అందం తీసుకొస్తుందో పెడితే కానీ అర్థం కాదు.. అలంకారప్రాయంగానే కాదు.. ఆరోగ్యంపరంగానూ.. ముక్కుపుడక మహాత్మ్యం అలాంటిది.. అంతలా అందాన్ని తెచ్చి పెట్టే ముక్కుపుడక గురించి తెలుసుకోకపోతే ఎలా?
******‘ముక్కు ముల్లాకు మెరిసెను.. మెరిసెను’ అంటూ పాటలు వచ్చినా, ముక్కుపుడక ఉందంటే వాళ్లు ‘తెలుగమ్మాయిలు’ అంటూ సినిమాలు డైలాగ్‌లు పెట్టినా అంతా ముక్కుపుడక చుట్టే తిరుగుతుంది. ఆ పేరుతో సినిమా కూడా ఉందంటే.. ముక్కుపుడకకి ఉన్న విశిష్టతేంటో అర్థం చేసుకోవచ్చు. అయితే మన ముక్కును బట్టి, ముఖాన్ని బట్టి కూడా ముక్కుపుడక ధరించాలని ఎప్పుడైనా అనుకున్నారా? కానీ అలాగే చేయాలట. ఏది పడితే అది పెట్టేసుకొని నప్పకుండా ఉంటే ఎలా? ఆ సమయంలో బాధపడడం కంటే ముందుగానే తెలుసుకోండి. ఎన్నిరకాలున్నాయి? అలాగే ముక్కుపుడకకి ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకోండి.
***ఎన్ని రకాలుగా..
ముక్కుపుడక.. ముక్కుపుల్ల.. నాథ్‌.. నోస్‌రింగ్‌ ఇలా పలుపేర్లతో, పలు డిజైన్లలో ఇవి మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. చాలావరకు పుల్లలా ఉన్న పుడకను పెట్టుకోవడం సంప్రదాయం వస్తున్నది. ముత్యం, డైమండ్‌, మొత్తం బంగారంతో పుల్లలా ఉండే ముక్కుపుడక ఉంటుంది. వెనుక స్క్రూతో ముక్కును బిగించినట్లుగా పెట్టేస్తారు. పువ్వుల్లా వచ్చే డిజైన్లతో వీటిని ఎక్కువగా చేయిస్తుంటారు. అప్పట్లో శ్రీదేవి ముక్కుపుడక చాలా ఫేమస్‌. అమ్మవారికి ఎక్కువగా అర్ధ చంద్రకారంలో పుడక పెడుతుంటారు. ప్రస్తుతం పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు మాత్రం వీటిని ధరిస్తున్నారు. దీంట్లో ప్రెస్సింగ్‌వి కూడా వస్తున్నాయి. కొన్ని ముక్కుపుల్లతో పాటు, ఈ పుడక పెట్టేలా వచ్చే డిజైన్లూ ఉన్నాయి. ముక్కుకి రంధ్రం చేయించకున్నా కూడా ముక్కుపుడక ధరించేలా కొన్ని డిజైన్లు ఉన్నాయి. వీటిని ఒత్తేస్తే చాలు. అలా ముక్కు మీద ఫిక్స్‌ అవుతుంది. ఇక నాథనీ అని.. రాజస్థాన్‌, గుజరాత్‌ ముక్కుపుడకలున్నాయి. సన్నగా.. చిన్న సైజు గాజులా వచ్చి, దానికి ఒక బంగారు తీగతో జుట్టుకు పెట్టేలా వచ్చే డిజైన్లున్నాయి. ఇవి ఎక్కువగా పెండ్లికూతుళ్లు ధరిస్తున్నారు. నాథనీలో కూడా రకాలున్నాయి. చైన్‌ లేకుండా వచ్చే ైస్టెల్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో రాజ్యమేలుతుంది. ఇవికాకుండా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ప్రత్యేకంగా ఈ ముక్కుపుడకలు పెడుతుంటారు. మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, దక్షిణాది రాష్ర్టాల్లో ఈ ముక్కుపుడకల సౌందర్యాన్ని చూడొచ్చు.
***ఏ ఆకృతికి.. ఎలా?
కోడిగుడ్డు ఆకృతి ఉన్న మహిళలు పంజాబీనాథ్‌ వంటి గొలుసులతో ఉన్న ముక్కుపుడకలు పెట్టుకోవచ్చు. ఇది ఈ ముఖాకఋతి వారికి బాగా సూటవుతుంది.
చిన్న ముక్కు లేదా చిన్న ముఖం ఉన్నవారు ఒక చిన్న వజ్రం ఉన్న స్టడ్స్‌ ఎంచుకోవాలి. దీనివల్ల ముఖం మరింత అందంగా మెరిసిపోతుంది.
*చతురస్రాకారం లేదా లాగర్‌ ముక్కు ఉన్న మహిళలు పెద్ద రాళ్లతో కూడిన ముక్కుపుల్లను పెట్టుకోవాలి. మీ ముఖం మరింత పెద్దగా కాకుండా కనిపించేలా చేస్తుంది. ముక్కుపుడక మీదకి మనసు మళ్లేలా చేస్తుంది.
పదునైన ముక్కు ఉంటే రింగుల్లా ఉండే ముక్కుపుడకలని ఎంచుకోవాలి. ఇది మీకు అద్భుతమైన రూపాన్ని పొందేలా చేస్తుంది.
*గుండ్రని ముఖం ఉన్న వాళ్లు వంపు ఆకారం, వఋత్తాకారంలో ఉన్న ముక్కు రింగ్‌ పెట్టుకోవాలి. దీనివల్ల ముఖం చాలా స్లిమ్‌గా కనిపిస్తుంది.
*హార్ట్‌ షేప్‌ ఉన్న వాళ్లు పెద్ద పెద్ద ముక్కు పుడకలు, నాథనిగా ఉన్నవాటిని ఎంచుకుఓవాలి. ఇది మీ విశాలమైన నుదిటి నుంచి దఋష్టిని ఆకర్షిస్తుంది.
పొడవాటి ముఖ ఆకారం ఉన్న మహిళలు పెద్ద పెద్ద రింగుల్లా ఉన్న వాటిని ఎంచుకుంటే బాగుంఆరు. గొలుసు లేని నాథ్‌ అన్ని ముఖాకఋతులకు బాగా కనిపిస్తుంది.