Movies

కంగనకు YPlus భద్రత

కంగనకు YPlus భద్రత

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం నేపథ్యంలో ఇటీవల కంగన చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ వాడకంపై మాట్లాడారు. ఈ మేరకు ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున భద్రత కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ‘వై ప్లస్‌’ కేటగిరీ సెక్యూరిటీలో 11 మంది సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు ఆమెకు భద్రతగా ఉండబోతున్నారు. ‘కంగన హిమాచల్‌ కుమార్తె. ఆమెకు ప్రాణాపాయం ఉన్నందున కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత ఏర్పాటు చేసింది’ అని ఈ సందర్భంగా హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ అన్నారు.