DailyDose

సుశాంత్ కేసులో కీలక మలుపు-నేరవార్తలు

Auto Draft

* సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మంగళవారం అరెస్ట్ చేసింది. డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్లు గుర్తించిన ఎన్‌సీబీ ఆమెను అదుపులోకి తీసుకుంది. డ్రగ్స్ కేసులో రియాను మూడు రోజుల పాటు ఎన్‌సీబీ విచారించింది. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్‌ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో రియా అంగీకరించింది.అయితే.. తాను మాత్రం డ్రగ్స్ వినియోగించలేదని, కేవలం సుశాంత్ కోసమే కొనుగోలు చేశానని రియా చెప్పుకొచ్చింది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా.. సుశాంత్ కేసులో డ్రగ్స్ వినియోగం దగ్గర మొదలైన విచారణ, బాలీవుడ్‌లో డ్రగ్స్ మత్తులో మునిగితేలే వారి పేర్లను రియా బయటపెట్టేవరకూ వెళ్లింది. మొత్తం 25 మంది బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లను ఎన్‌సీబీ విచారణలో రియా చక్రవర్తి బయటపెట్టినట్టు సమాచారం.

* ప్రాచీన ఆలయాల్లో చోరీ కి పాల్పడుతున్న దొంగల ముఠా ను అరెస్ట్ చేసిన కడప జిల్లా పోలీసులు..మీడియా కు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్. పి కే.కే.ఎన్ అన్బు రాజన్ ఐ.పి.ఎస్..రాయచోటి లో మకాం వేసి 13 ఆలయాల్లో చోరీకి పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా….జిల్లాలోని సుండుపల్లె, రామాపురం, వీరబల్లి, సంబేపల్లె, చక్రాయపేట, చిన్నమండెం, పెండ్లిమర్రిలోని 13 ఆలయాల్లో చోరీకి పాల్పడిన దొంగలు..కర్నాటక రాష్ట్రం బాగేపల్లె, అనంతపురం జిల్లా కు చెందిన నలుగురు దొంగల ముఠా అరెస్ట్..వారి వద్ద నుంచి దాదాపు 4లక్షల20వేల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, 6వేల నగదు, 3 బైక్ లు, అమ్మవారి కత్తి స్వాధీనం..ప్రాచీన ఆలయాలపై రెక్కి నిర్వహించి చోరీలకు పాల్పడిన దొంగలు…అమ్మవారి తాళిబొట్టు ను సైతం దొంగిలించిన దొంగలు..

*
ఉత్తర‌ప్రదేశ్‌లో గ్యాస్‌ లీక్‌.. ఐదుగురు మృతి. ఉత్తరప్రదేశ్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ లీక్‌ కావడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* మద్యంపై హైకోర్టు తీర్పును సవాల్ చేసే యోచనలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఉంది.ఇతర రాష్ట్రాల నుంచి 3 బాటిళ్లు తెచ్చుకోవచ్చంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.హైకోర్టు తీర్పుపై అప్పీల్‍కు వెళ్లాలని ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నివేదిక పంపింది.తీర్పును అడ్డు పెట్టుకొని అక్రమ రవాణా పెరిగే ఛాన్స్ ఉందని ఆలోచనలో ఉంది.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠన చర్యలు తీసుకుంటామని ఎస్‍ఈబీ స్పష్టం చేసింది.కోర్టు తీర్పు, తాజా పరిస్థితులపై ఎక్సైజ్‌శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపనుంది.

* కృష్ణాజిల్ల మైలవరంలో వాలంటీర్కు వైసీపీ నాయకుల బెదిరింపులు, మాట వినకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని వేధింపులు.

* ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్వాహకులు డాక్టర్‌ మురళీకృష్ణపై ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌కిరణ్‌ పర్యవేక్షణలో ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు డాక్టర్‌ మురళీకృష్ణను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. అనంతరం మురళీకృష్ణను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఈనెల 18 వరకు రిమాండ్‌ విధించారు. వైద్య పరీక్షల అనంతరం మురళీకృష్ణను భీమవరం సబ్‌జైలుకు తరలించారు.

* ఉగ్రవాద సహచరులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని బందీపోరా జిల్లా హజిన్‌ ప్రాంతంలో నేడు చోటుచేసుకుంది.నిందితుల వద్ద నుంచి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.హజీన్‌ ప్రధాన మార్కెట్‌లో పాకిస్తాన్‌ జెండాలను ఎగురవేస్తున్నట్లుగా సమాచారం అందుకున్న భద్రతా బలగాల సిబ్బంది, స్థానిక పోలీసులు సంయుక్తంగా రైడ్‌ చేశారు. లష్కరే-ఇ-తోయిబా ఉగ్రవాదుల సహచరులను ముగ్గురిని అరెస్టు చేశారు.సంబంధిత సెక్షన్ల కింద వీరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు.నిందితులను మీర్‌ మొహల్లా ప్రాంతానికి చెందిన ముజీబ్‌ శ్యామస్‌, తన్వీర్‌ అహ్మద్‌ మిర్‌, ఇంతియాజ్‌ అహ్మద్‌ షేక్‌గా గుర్తించారు. వీరి వద్ద నుంచి గ్రనేడ్‌, పలు దుస్తులు, కుట్టు మిషన్‌, పాక్‌ జాతీయ జెండాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.