WorldWonders

నీ కేశ క్షుత్తుకి జోహార్లు…

నీ కేశ క్షుత్తుకి జోహార్లు…

ఒక వెంట్రుక క‌డుపులోకి వెళ్తేనే గాబ‌రా ప‌డిపోతారు. అలాంటిది ఓ మ‌హిళ ఏకంగా 7 కిలోల జుట్టును న‌మిలి మింగేసింది. ఈ సంఘ‌ట‌న జార్ఖండ్‌లో చోటు చేసుకున్న‌ది. బొకారో జిల్లాలోని ఒక ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో వైద్యుల బృందం ఇటీవ‌ల 17 ఏండ్ల స్వీటీ కుమారి పొత్తిక‌డుపులో జుట్టును తొలిగించారు. ఈ ఆప‌రేష‌న్‌కు ఆరు గంట‌ల స‌మ‌యం ప‌ట్టిందంటున్నారు వైద్యులు.డాక్ట‌ర్ సాహు త‌న 40 ఏండ్ల కెరీర్‌లో ఇలాంటి సంఘ‌ట‌న ఎప్పుడూ చూడ‌లేని చెబుతున్నారు. స్వీటీ కుమారికి మూడేండ్ల క్రితం అల్ట్రాసౌండ్ ప‌రీక్ష‌లో క‌డుపులో క‌ణితి ఉంద‌ని వైద్యులు అనుమానించారు. ఆ త‌ర్వాత పొత్తిక‌డుపుపై ఉన్న భారీ ముద్ద హెయిర్‌బాల్‌ను క‌నుగొన్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ కుమారి ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా పూర్త‌యింది. ఈ ప‌రిస్థితిని రాపన్జెల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. చాలారోజుల నుంచి జుట్టును న‌మిలి మింగ‌డం వ‌ల్ల ఈ అరుదైన పేగు ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు.