Movies

రెజీనా రిటైర్మెంట్ కామెంట్స్

రెజీనా రిటైర్మెంట్ కామెంట్స్

లాక్‌డౌన్‌ లైఫ్‌ ముందస్తు రిటైర్మెంట్‌ తీసుకున్నట్టుగా అనిపిస్తోంది అంటున్నారు రెజీనా. కొన్ని నెలలుగా ఎటూ కదలకుండా తన అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్నారు రెజీనా. ఈ లాక్‌డౌన్‌ గురించి రెజీనా మాట్లాడుతూ – ‘‘యాక్టర్‌గా బిజీ షెడ్యూల్‌ వల్ల పెట్‌ని పెంచుకోవాలనుకున్నా కుదర్లేదు. ఈ ఖాళీ సమయంలో ఓ కుక్కపిల్లను పెంచుకున్నాను. అలాగే మా అపార్ట్‌మెంట్‌ వాళ్లతో ఎక్కువ సమయం గడిపే వీలు దొరికింది.మా ఇంటి పక్కన ఉన్న చిన్న పిల్లలతో చాలా ఎక్కవ సమయం గడిపాను. చాలా గేమ్స్‌ ఆడుకున్నాం. మా ఆపార్ట్‌మెంట్‌ లోపలే కలసి డిన్నర్‌ చేస్తుంటాం. సినిమాలు చూస్తుంటాం. లేట్‌ నైట్‌ కార్డ్స్‌ ఆడేవాళ్లం. నా పెట్‌ బెల్లాతో సాయంత్రాలు వాకింగ్‌కి వెళుతున్నాను. ఇవన్నీ నా రిటైర్‌మెంట్‌ తర్వాత జరుగుతాయనుకున్నాను. కానీ ఈ లాక్‌డౌన్‌ చిన్న వయసులోనే ముందస్తు రిటైర్‌మెంట్‌ ఫీలింగ్‌ను తెచ్చింది’’ అన్నారు