Politics

పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణా అసెంబ్లీలో తీర్మానం

పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణా అసెంబ్లీలో తీర్మానం

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… తెలంగాణ బిడ్డ,  దక్షిణాదినుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన  రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థికసంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతికోవిదులు, బహుభాషావేత్త, దేశప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాలలో మేరునగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలనీ, పార్లమెంట్ ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్నీ, చిత్తరువునూ ప్రతిష్ఠించాలనీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ నరసింహారావుగారి  పేరు పెట్టాలనీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తోందంటూ తీర్మానం ప్రవేశపెట్టారు కేసీఆర్.