Business

Flash:విజయవాడలో కోటిన్నర హవాల సొమ్ము పట్టివేత

Vijayawada Police Seize 1.5Crore Hawala Money

విజయవాడలో పోలీసులు తనిఖీలు చేశారు.కేసు తనిఖీల్లో భాగంగా భారీగా హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భవానిపురం ప్రాంతంలో రూ.1.50 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. రాష్ట్రంలో సాగుతున్న హవాలా వ్యవహారం గుట్టురట్టు అయ్యింది. టాస్క్​ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హవాలా ముఠాను పట్టుకున్నారు. కారులో సొమ్మును తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. రూ.కోటి 40 లక్షల ఇండియన్ కరెన్సీ, రూ. 24 లక్షల విలువ చేసే 30 వేల డాలర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ బంగారు వ్యాపారితో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నరసాపురం నుంచి హైదరాబాద్​కు హవాలా సొమ్మును తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు టాస్క్​ఫోర్స్ అధికారులు తెలిపారు.