Health

మహమ్మారి బారిన మార్జాలాలు

మహమ్మారి బారిన మార్జాలాలు

పిల్లులు కూడా కొవిడ్‌ బారిన పడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది! మహమ్మారి తొలిసారిగా వెలుగుచూసిన వుహాన్‌లోని మార్జాలాలకు హువాజాంగ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు పరీక్షలు నిర్వహించారు. 102 పిల్లుల నుంచి రక్త, తెమడ నమూనాలను సేకరించి పరీక్షించగా, 15 జంతువుల్లో యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. అయితే- వాటిలో ఎలాంటి కొవిడ్‌ లక్షణాలు లేకపోవడం, మరణాలు సంభవించకపోవడం విశేషం.