Movies

నిహారిక బదులు మేఘా

నిహారిక బదులు మేఘా

త్వరలో ప్రారంభం కానున్న ఓ సినిమాలో నిహారిక కొణిదెల ప్లేస్‌ను నటి మేఘా ఆకాశ్‌ రీప్లేస్‌ చేశారు. అశోక్‌ సెల్వన్‌ హీరోగా స్వాతిని దర్శకత్వంలో కోలీవుడ్‌లో ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకోసం మొదట చిత్రబృందం నిహారికను ఎంపిక చేసుకుంది. వేసవిలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ కొవిడ్‌-19 విజృంభణ కారణంగా వాయిదా పడింది. ఇటీవల నిశ్చితార్థంతో వివాహబంధంవైపు అడుగులువేసిన నిహారిక ప్రస్తుతం వేరే ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో ఆమె సదరు కోలీవుడ్‌ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు చిత్ర నిర్మాతకు తెలియజేశారు.