NRI-NRT

చైనా టెలికాం మెడలు వంచుతున్న అమెరికా

చైనా టెలికాం మెడలు వంచుతున్న అమెరికా

కరోనా వైరస్‌పై సరైన సమాచారం ఇవ్వలేదని చైనాపై దుమ్మెత్తిపోస్తున్న అమెరికా.. ఆ దేశంపై ప్రతీకార చర్యలకు పూనుకుంది! దేశ భద్రతకు ముప్పుందని అమెరికాలో సేవలందిస్తున్న ‘చైనా టెలికాం’ సంస్థపై నిషేధానికి సిద్ధమవుతోంది. చైనా టెలికాం (అమెరికా) సంస్థపై ఆంక్షలు విధించాలని, అనుమతులు రద్దుచేయాలని ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ (ఎఫ్‌సీసీ)కు రక్షణ, హోం, వాణిజ్య సహా అత్యున్నత శాఖలు సూచించాయి. ‘చైనా టెలికాం వల్ల దేశ రక్షణ, భద్రత, ఆర్థిక, న్యాయ వ్యవస్థకు ముప్పుందని అధికార వర్గాలు గుర్తించాయి. ప్రజాప్రయోజనార్థం ఆ సంస్థ లైసెన్సులను ఎఫ్‌సీసీ రద్దు చేయాలి’ అని న్యాయశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది గనక ఆమోదం పొందితే చైనా టెలికాం సేవలు పొందుతున్న అమెరికాలోని లక్షలాది మొబైల్‌, ఇంటర్నెట్‌ వినియోగదారులు కమ్యూనికేషన్‌ సంబంధాలు కోల్పోయే అవకాశం ఉంది. అయితే సదరు సంస్థపై బీజింగ్‌ దోపిడీ, నియంత్రణ, ప్రభావం ఉన్నాయని న్యాయశాఖ, వాణిజ్య శాఖలు అంటున్నాయి.