Sports

ఏమని విమర్శించమంటారు?

ఏమని విమర్శించమంటారు?

టీమ్‌ఇండియా ఆటగాళ్లను పొగడడంపై వచ్చే విమర్శలపై అక్తర్‌ మరోసారి స్పందించాడు. ‘నేనేం చెప్పాలో మీరే చెప్పండి. కోహ్లీ టాప్‌ బ్యాట్స్‌మన్‌ మాత్రమే కాదు.. 70 అంతర్జాతీయ శతకాలు నమోదు చేసిన ఆటగాడు. అలాగే ఒక కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆటగాళ్లే టీమ్‌ఇండియాకు విజయాలు అందిస్తున్నారు. అలాంటప్పుడు వారిని ఎలా తిట్టగలను? ఒక కచ్చితమైన ప్రణాళిక, దూకుడు స్వభావంతో భారత్‌ ముందుకు దూసుకు వెళుతోంది. బుమ్రానే ఉదాహరణగా తీసుకోండి. అతడెంతో మెరుగయ్యాడు. అలాంటి ఆటగాడిని ఏమని విమర్శించాలి?’ అని మాజీ పేసర్‌ ఎదురు ప్రశ్నించాడు.