Business

ఇకనుండి అన్నీ విద్యుత్ ప్రీపెయిడ్ మీటర్లే

ఇకనుండి అన్నీ విద్యుత్ ప్రీపెయిడ్ మీటర్లే

విద్యుత్ సంస్కరణల్లో భాగంగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇళ్లు కమర్షియల్ వ్యాపార సంస్థలు వాడే విద్యుత్ విషయంలో భవిష్యత్తులో కేటాయించే మీటర్లను ప్రీపెయిడ్ మీటర్లే ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు ముసాయిదాను పంపుతూ షాక్ ఇచ్చింది.

ముసాయిదా ప్రకారం ఇక విద్యుత్ వినియోగదారులంతా విద్యుత్ కోసం ముందస్తుగా డబ్బులు చెల్లించి బ్యాలెన్స్ వేసుకుంటేనే ఆ మేరకు కరెంట్ సరఫరా అవుతుంది. మనం మొబైల్ లో ఎలాగైతే బ్యాలెన్స్ కోసం రీచార్జ్ చేసుకుంటామో అలాగే విద్యుత్ విషయంలో కూడా రీచార్జ్ చేసుకోవాలన్న మాట..

ప్రస్తుతం ఇళ్లు షాపుల్లో వాడకానికి దరఖాస్తు చేసుకునే వాళ్లకు ఈ ప్రీపెయిడ్ మీటర్లు ఇవ్వాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. ఈ విధానంతో బిల్లులు చెల్లిస్తున్న వాళ్లపై ఎటువంటి భారం పడదని నిపుణులు చెబుతున్నారు. ఎవరైతే బిల్లులు ఎగ్గొడుతారో వారికే ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నాయి. ముందుగా రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్ సరఫరా లేకుంటా ఆగిపోతుంది. విద్యుత్ బకాయిలు కట్టని వారికి ఈ నిర్ణయం షాకింగ్ గా ఉంటుంది.

విద్యుత్ బిల్లులు దేశంలో పెరిగిపోతున్న కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో వేలకోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు పెండింగులో ఉన్నాయి. పేరుకుపోతున్న విద్యుత్ బకాయిల కారణంగానే కేంద్రం ప్రీపెయిడ్ మీటర్లను అమల్లోకి తెస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు వాడుతున్న ఇంటి ఆఫీసు విద్యుత్ మీటర్లను సైతం మారుస్తారా? లేదా పాతవే కొనసాగిస్తారా అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు.