Politics

తెలంగాణా అసెంబ్లీలో 8బిల్లులు ఆమోదం

తెలంగాణా అసెంబ్లీలో 8బిల్లులు ఆమోదం

8 బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

★ ఎనిమిది బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం లభించింది.

★ తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ఆరవరోజు జరిగింది.

★ ఈ సమావేశాల్లో భాగంగా 8 బిల్లులను ప్రవేశపెట్టగా మొత్తం బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.

8 బిల్లులు ఇవే..

1. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం

2. తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లు- 2020కు శాసన సభ ఆమోదం

3. తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు- 2020కు ఆమోదం

4. తెలంగాణ కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం

5. తెలంగాణ వస్తు మరియు సేవల పన్ను సవరణ బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం

6. తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ విధానం (టీ ఎస్- బి పాస్) బిల్లు- 2020కు ఆమోదం

7. తెలంగాణ న్యాయస్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లు- 2020కు ఆమోదం

8. తెలంగాణ సివిల్ న్యాయస్థానాలు సవరణ బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం లభించింది.

★ అనంతరం శాసనసభను మంగళవారానికి స్పీకర్ వాయిదా వేయడం జరిగింది.