Business

ఇండియాలో తగ్గిన చైనా పెట్టుబడులు-వాణిజ్యం

ఇండియాలో తగ్గిన చైనా పెట్టుబడులు-వాణిజ్యం

* ఇటీవల కాలంలో క్రెడిట్‌ కార్డు వాడకం సర్వ సాధారణమైపోయింది. డబ్బులు తర్వాత కట్టుకోవచ్చనో, కార్డు ఉంది కదా వాడేద్దాంలే అన్న ఉద్దేశంతోనో చాలా మంది చిన్న చిన్న అవసరాలకు కూడా స్వైప్‌ చేసేస్తుంటారు. అంతేకాకుండా కంపెనీ అవకాశమిచ్చింది కదా అని మినిమం డ్యు కడుతూ అప్పును పెంచుకుంటారు. ఓ ప్రణాళికా బద్ధంగా ఉపయోగిస్తే క్రెడిట్ కార్డుతో చాలా లాభమే. అదే సమయంలో ఖర్చుపై నియంత్రణ లేకపోతే కష్టాలు కొని తెచ్చుకున్నట్లవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్‌కార్డు ఉపయోగించడం గురించి బాగా తెలిసిన వారు ‘మినిమం డ్యు’ కట్టడానికి ఆలోచిస్తారు..ఎందుకో తెలుసా..? మినిమం డ్యు చెల్లించడం వల్ల వినియోగదారుల కంటే బ్యాంకర్లకే ఎక్కువ ప్రయోజనం. అదెలాగో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. చాలా వరకు క్రెడిట్‌ కార్డు కంపెనీలు మీరు వాడిన మొత్తంలో 5 శాతాన్ని మినిమం డ్యు నిర్ణయిస్తాయి. ఉదాహరణకు రూ.30,000 క్రెడిట్‌ కార్డు నుంచి ఉపయోగిస్తే బిల్లు చెల్లింపు తేదీన రూ.1500 కడితే సరిపోతుంది. మిగతా 28,500 తర్వాతి బిల్లులో కట్టాల్సి ఉంటుంది. అయితే దీనిపై నెలకు 3 నుంచి 4 శాతం వడ్డీ వేస్తారు. అవసరమనుకుంటే దీనిని కూడా తర్వాత నెలలో కూడా కట్టుకోవచ్చు.

* దేశ ఆర్థిక వ్యవస్థలో చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 163.77 మిలియన్‌ డాలర్లు మాత్రమే ఈ రూపంలో వచ్చాయని పేర్కొంది. గత మూడేళ్లుగా చైనా నుంచి వచ్చే ఎఫ్‌డీఐలు క్రమంగా తగ్గుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.53 సమయంలో సెన్సెక్స్‌ 274 పాయింట్ల లాభంతో 39,128 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 11,533 వద్ద కొనసాగుతున్నాయి. ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, బ్లూస్టార్‌, ఎంసీఎక్స్‌, ఖజారియా సిరామిక్స్‌ షేర్లు లాభపడుతుండగా.. ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌, జీసీఐ హౌసింగ్‌, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌, ఫ్యూచర్‌ రీటైల్‌ షేర్లు నష్టపోతున్నాయి.

* 42 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు రూ.1.63 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ ఆదివారం తెలిపింది. ఈ రంగానికి ఉద్దేశించిన రూ.3 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకం(ఈసీఎల్‌జీఎస్‌) కింద వీటిని మంజూరు చేశారు. కాగా, సెప్టెంబరు 10 నాటికి మంజూరు చేసిన రుణాల్లో రూ.1.18 లక్షల కోట్లు మాత్రమే 25 లక్షల కంపెనీలకు జారీ అయినట్లు అందులో వివరించింది. మే నెలలో ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకంలో ఈ పథకం ఒక భాగం అన్న సంగతి తెలిసిందే.

* బాలీవుడ్‌ నటి సన్నీ లియోని ఓ లగ్జరీ కార్ల బ్రాండ్‌కు ఫిదా అయిపోయింది. ఇటలీకి చెందిన కార్ల తయారీ సంస్థ మసెరటి బ్రాండ్‌ కార్లపై ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ఆమె వద్ద ఈ బ్రాండ్‌కు చెందిన రెండు కార్లు ఉండగా.. తాజాగా మరో కారు(మసెరటి ఘిబ్లీ మోడల్‌)ను కొనుగోలు చేసింది. అంతకు ముందే సన్నీ వద్ద క్వాట్రోపోర్టె, ఘిబ్లీ నెర్రిస్సిమో మోడల్స్‌ ఉన్నాయి. గతంలో ఆమె కొనుగోలు చేసిన కార్లతో పోలిస్తే కొత్తగా కొనుగోలు చేసిన కారు ఎంట్రిలెవల్‌లోకే వస్తుంది.

* అమెరికాలో నిషేధపు అంచుల్లో ఉన్న టిక్‌టాక్‌ యాప్‌ను మైక్రోసాఫ్ట్‌కు విక్రయించేందుకు దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ నిరాకరించింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ ప్రతిపాదనను అంగీకరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. దేశ, పౌరుల భద్రత దృష్ట్యా తమ కొనుగోలు ప్రతిపాదనలు టిక్‌టాక్‌ వినియోగదారులకు శ్రేయోదాయకంగా ఉండేదని విశ్వాసం వ్యక్తం చేసింది. పౌరుల, దేశ, సైబర్‌ భద్రతలకు అనుగుణంగా.. నకిలీ సమాచారం అరికట్టేలా మార్పులు చేసేవాళ్లమని వివరించింది.

* దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఐటీ షేర్లు రాణించినప్పటికీ ప్రధాన షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్ అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. అంతర్జాతీయ, దేశీయ సానుకూల పరిణామాలతో లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.