NRI-NRT

కోవిద్ వారియర్స్‌కు మన్నవ విరాళం

కోవిద్ వారియర్స్‌కు మన్నవ విరాళం

ప్రవాసాంధ్రుడు మన్నవ మోహనకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని కోవిద్ వైరస్ నియంత్రణకై విశేష సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఆయన మిత్రబృందం మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. గుంటూరు జాయింట్ కలెక్టర్ ఏ.ఎస్.దినేస్‌కుమార్‌కు వీటిని అందజేశారు. మోహనకృష్ణ చొరవను JC అభినందించారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ వలి, స్వరూప్, గజ, కొండ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.