Politics

ప్రజలకు చంద్రబాబు పిలుపు

ప్రజలకు చంద్రబాబు పిలుపు

• వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి.
• తెలుగుదేశం హయాంలో మత సామరస్యాన్ని కాపాడాం. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాలను సమానంగా చూశాం.
• పిఠాపురంలో 6 దేవాలయాలలో 23 విగ్రహాలను ద్వంసం చేశారు. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో వెంకటేశ్వర స్వామీ రధాన్ని దగ్ధం చేశారు. అంతర్వేధిలో రధాన్ని కాల్చేశారు.
• ఇన్ని సంఘటనలు జరిగినా ఏ మాత్రం జాగ్రత్త లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రశ్నించిన వారిపై ఎదురు దాడి చేయటం వైసీపీ కి అలవాటుగా మారింది.
• విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో రధాని కి ఉండే మూడు వెండి సింహాలు మాయమైతే ఈఓ ఇప్పటి వరకు కేసు కూడా నమోదు చేయలేదు.
• దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతున్న తీరు నిర్లక్ష్యానికి నిలువుటద్దం లా ఉంది.
• నీచంగా వ్యవహరిస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు.
• కేకేస్తే వినపడే దూరంలో ఎండోమెంట్ రిజిస్ట్రార్ ఆలయం సమీపంలోనే ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు.
• నాలుగో సంహాన్ని లాగేదానికి ప్రయత్నించి రాకపోవడంతో వదిలిపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.
• నిడమానూరులో షిర్డీ సాయిబాబా విగ్రహాన్ని ద్వంసం చేశారు.
• ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయ భూములకు సంబంధించి 6 అక్రమాలు జరిగాయి. దేవాలయ ఆస్తులు, ఆదాయాలకు సంబంధించి 9 అక్రమాలు జరిగాయి. ఆలయాల కూల్చివేతలు 12 జరిగాయి. అన్యమత ప్రచారాలు 13 జరిగాయి. అర్చకులపై వేదింపులు 2 జరిగాయి. గోశాలలో గోవులు చనిపోయిన సంఘటనలు 3 జరిగాయి. ఇలాంటివి మొత్తం దాదాపు 80 సంఘటనలు జరిగాయి.
• ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు?. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన సంస్కృతి, బాధ్యత పాలకులకు ఉండాలి. అలా కాకుండా నా ఇష్టానుసారం పరిపాలన చేస్తానంటే ప్రజలు ఊరుకోరు. తిరగబడతారు.
• తిరుపతిలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అన్యమతస్తులు తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకోవాలంటే వాళ్లు డిక్లరేషన్ ఇవ్వాలి. సోనియా గాంధీ లాంటి వాళ్లు ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.
• కానీ తిరుపతిలో అన్యమతస్తులు యదేచ్చగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తన చాలా బాధాకరం. అన్ని మత సాంప్రదాయాలను సమానంగా కాపాడాల్సిన ముఖ్యమంత్రి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
• హిందూ దేవాలయాలపై 80 దాడులు జరిగితే ఈ ముఖ్యమంత్రికి ఇంకా పరిపాలించే అర్హత ఉందా?
• ఏదేని మత విశ్వాసాలపై దాడులు జరిగితే కఠినంగా వ్యవహరించి వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్ పై లేదా?
• ఈ రోజు హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న వారు రేపు మసీదులపై, చర్చిలపై కూడా దాడులు చేస్తారు.
• ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా, ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నిస్తున్నా.
• మొదటి సంఘటన జరిగినప్పుడు ఈ ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించి ఉంటే ఈ సంఘటనలు జరిగి ఉండేవి కాదు.
• సీబీఐ విచారణ ఎదొర్కొన్న శేఖర్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేశాడని ఒప్పుకుని రాజీనామా చేసి వెళ్లిపోయిన వ్యక్తిపై నాడు ఆరోపణలు చేసిన వైసీపీ తిరిగి అతన్నే ఎందుకు తీసుకొచ్చి పదవిలో కూర్చోబెట్టారని ప్రశ్నిస్తున్నా.
• అయోద్యలో శ్రీరామ మందిరం శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రసారం చేయని ఎస్.వి.బీ.సీ పై విచారణ ఎందుకు చేయలేదు?
• దేవాలయ ఆస్తులను అమ్మాలని ప్రయత్నించారు. తిరుమల బస్ టికెట్ లపై అన్యమత ప్రచారం చేశారు, టిటిడీ వెబ్ సైట్ లో క్రైస్తవ గీతాలు పెట్టడం లాంటివి ఎన్నో సంఘటనలు జరిగాయి.
• టిటిడీ డైరీ ముద్రణను ఎందుకు తగ్గంచాల్సి వచ్చింది? తిరుమలలో హుండీకి ఉండే వస్త్రాన్ని రోజుకు మూడు సార్లు మార్చే సాంప్రదాయం నుండి మూడు రోజులకు ఒకసారి మార్చే పరిస్థితికి వచ్చారు.
• తిరుపతిలో సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రైవేటు యాగాలు చేయడం చేస్తున్నారు. ఎస్.వి.బీ.సీ చైర్మన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తిరుపతిలో లిక్కర్, నాన్ వెజిటేరియన్ దొరికే పరిస్థితి వచ్చింది.
• శారధా పీఠం మహాసభలకు శ్రీవారి సొమ్మును ఖర్చు చేశారు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాదా? ఇది కరెక్టేనా?
• ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా పూజిస్తారు. మా కుల ధైవం కూడా వెంకటేశ్వర స్వామినే. రాజశేఖర్ రెడ్డి హయాంలో తిరుమలలో అపచారం జరిగినప్పుడు స్వయంగా ఏడు కొండలు ఎక్కి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాను.
• తాడేపల్లిగూడెంలో ఒక చర్చిపై దాడి జరిగితే దానిపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకున్నాం.
• కనకదుర్గమ్మ దేవాలయంకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. చీరల కుంభకోణం, హుండీ ఆదాయంలో అక్రమాలు లాంటి సంఘటనలు చాలా జరిగాయి. కానీ ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆలయంలో ఆడిట్ ఎందుకు నిర్వహించలేదు?
• కనకదుర్గమ్మ టెంపుల్ లో సీసీ టీవీ పూటేజ్ లను కూడా మాయం చేశారు. ఇంత వరకు కంప్లైంట్ ఇవ్వన్ని ఈఓ ఆ పదవిలో కొనసాగే అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నా. ఎండోమెంట్ మినిస్టర్ కూడా ఇదే జిల్లాకు చెందిన వ్యక్తి. కానీ చర్యలు శూన్యం.
• శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయంలో అనేక అవకతవకలు జరిగాయి. 6.30 కి జరగవలసిన ఉత్సవాలు మంత్రి రాలేదని రాత్రి 9 గంటలకు చేశారు.
• 426 జివో కు వ్యతిరేకంగా దేవాలయాలలో దుకాణాలను అన్యమతస్తులకు ఇస్తున్నారు.
• వాటికన్ సిటీ, జెరూసలేం లలో అన్యమత ప్రచారం చేస్తే ఆ మత భక్తుల విశ్వాసాలు దెబ్బతినవా? అలానే హిందూ మత దేవాలయాలలో అన్యమత ప్రచారం చేస్తే హిందువుల మనోభావాలు దెబ్బతినవా?.
• కాణిపాక వినాయక స్వామి ఆలయంలో తప్పులు చేశారు. సింహాచలం దేవాలయంకు సంబంధించి అర్ధ రాత్రి ఐదు జీవోలు ఇచ్చారు. పి.వి.జి రాజు దేవాలయాన్నికట్టి ఒక ట్రస్టు పెడితే ఆ ట్రస్టును నాశనం చేసే పరిస్థితికి వచ్చారు.
• సత్యనారాయణ స్వామి ఆలయంలో అన్యమత ప్రచారం చేస్తున్నారు. దీన్ని అడ్డుకున్న ఈఓను కొట్టే పరిస్థితికి వచ్చారు.
• జగ్గయ్యపేట తిరుమల గిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఇచ్చిన సామాగ్రిని ఆలయం ఈఓ బయటకు తరలించారు.
• పట్టసీమ వీరభధ్రస్వామి గుడికి వెళ్లే మార్గాన్ని అడ్డగించి భక్తులను పోనీయకుండా వారి మనోభావాలను దెబ్బతీశారు.
• కంకిపాడు లో పిండప్రధానం చేసుకునేందుకు కూడా అడ్డంకులు సృష్టించారు. పాత గుంటూరులో దుర్గమ్మ ఆలయాన్ని కూల్చివేశారు. బోగోలు మండలం బిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి రధాన్ని దగ్ధం చేశారు.
• ఇళ్ల పట్టాల కోసం దేవాలయ భూములను సేకరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తులు ఇచ్చిన భూములను దేవాలయాల కోసమే వినియోగించాలి.
• తెలుగుదేశం హయాంలో ఎండోమెంట్ యాక్టును చాలా సమర్ధవంతంగా అమలు చేశాం. చర్చికి సంబంధించిన ఆస్తులలో ఎవరు కలుగచేసుకునే వీలులేదు. కానీ దేవాలయ భూములను మాత్రం అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నారు.
• హైకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పని చేస్తుంది. నిజాయతీగా పనిచేసే అధికారులను బదిలీలు చేస్తున్నారు. టిటిడీ భూములను అమ్మాలని ప్రయత్నిస్తే భక్తులు ఎదురు తిరిగితే మానుకున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన నిధుల మళ్లింపుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు.
• వినాయక చవితి వేడులపై ఆంక్షలు విధిస్తూ జీఓ నం.1307 ఇచ్చారు.. కానీ రాజశేఖర్ రెడ్డి జన్మదినానికి మాత్రం ప్రోత్సాహకాలు ఇస్తూ 2 జీవోలు విడుదల చేశారు.
• భక్తుల మనోభావాలను, ప్రజల నమ్మకాలను వమ్ము చేసే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు?. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ముఖ్యమంత్రిపై ఉంది. మంత్రిని డిస్ మిస్ చేయాలి. కనకదుర్గమ్మ దేవాలయం ఈఓ పైన చర్యలు తీసుకోవాలి.
• అలా కాదు, ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.
• టీడీపీ నాయకులపై దాడులు చేసారు, దళితులు పై దాడులు చేసారు, ఇప్పుడు దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఇలాంటి వాటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడరు. చట్టం అందరికి ఒకేలా వర్తింపచేయలి.
• ఈ విధమైన అరాచక పాలన చేస్తే సహించేది లేదు. ప్రజలు తిరుగుబాటు చేస్తే పరిస్థితి ఏంటో అలోచించుకోండి.
• వైసీపీ దుర్మార్గపు చర్యలు ఎండగట్టేందుకు 7 రోజుల పాటు దేవాలయాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చాం.
• సీబీఐ విచారణ చేసి తప్పు చేసిన వారిందరికి శిక్షలు విధించాలి. టీడీపీ పాలనలో మత సామరస్యం నెలకొల్పాం అన్ని మతాలను సమనగం గౌరవించాం.
• రాష్ట్రంలో ఎప్పుడూ లేని వింత పోకడలు చూస్తున్నాం. అంతర్వేది ఘటనలో భక్తులు జైల్లో ఉంటే అరాచక శక్తులు భయట తిరుగుతున్నారు. ఇదేనా మీ పాలన?
• మాట్లాడితే మాకు మెజార్టీ ఉందంటున్నారు. మెజార్టీ ఉంటే బడుగు బలహీన వర్గాల వారిపై దాడులు చేస్తారా? దేవాలయ పై దాడులు చేస్తారా? ఇది మంచి పద్ధతి కాదు. కనకదుర్గమ్మ ఆలయంలో రధం విగ్రహాల చోరీ పై ఈవో నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు.
• దేవాలయల్లో జరిగిన అన్ని ఘటనలపై సీబీఐ విచారణ జరపాలి. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి నోరు తెరచి మాట్లాడాలి. అరాచక శక్తుల పై పోలీసులు ఉక్కుపాదం మోపాలి. పోలీసు వ్యవస్థ ప్రతిష్ట ఇప్పటికే మంట కలిసింది. పోలీసులు ఇప్పటికైనా రియాలైజ్ అవ్వాలి. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కల్గించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం చుస్తూ ఎవరు ఊరుకోరు.
• ప్రజల్లో చైతన్యం రావాలి. దేవాలయాలను చర్చీలను మనం కాపాడుకోలేకపోతే మనల్ని మనమే కాపాడుకోలేని పరిస్థితి వస్తుంది. వైసీపీ అరచకాలపై ప్రజలంతా తిరుగుబాటు చేయాలి.
• 16 నెలల పాలనలో దేవాలయాల్లో చోటు చేసుకున్న అన్ని ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలి. ఇప్పటికైనా దేవాలయాలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి. ప్రజలే వైసీపీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.