Devotional

శ్రీశైలంలో వెండి నాణేలు లభ్యం

శ్రీశైలంలో వెండి నాణేలు లభ్యం

శ్రీశైలంలోని పంచ మఠాల్లో ఒకటైన ఘంటామఠంలో మంగళవారం తామ్ర శాసనాలు, వెండి నాణేలు లభ్యమయ్యాయి. ఘంటామఠం ప్రాంగణంలోని చిన్న శివాలయాన్ని పునరుద్ధరించేందుకు పనులు చేస్తుండగా రాతి గోడల్లో ఇవి లభించాయి. రాతి గోడల మధ్య మూడు తామ్ర శాసనాలు, మొత్తం 245 వెండి నాణేలను అధికారులు గుర్తించారు. దేవస్థానం ఈవో రామారావు, తహసీల్దారు రాజేంద్రసింగ్‌, ఎస్సై హరిప్రసాద్‌ సిబ్బందితో వచ్చి వాటిని పరిశీలించారు. తామ్ర శాసనాల్లో నాగరి, కన్నడ లిపి, శివలింగాన్ని రాజు మొక్కుతున్నట్లు, నంది, గోవు చిత్రాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వెండి నాణేలు 1800 నుంచి 1910 సంవత్సరాలకు చెందిన బ్రిటిష్‌ పాలన నాటివిగా గుర్తించారు.