Movies

రియా ఎవరు?

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వాడకం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు నటి కంగన రనౌత్‌.. బీటౌన్‌ సెలబ్రిటీలు, ముంబయి నగరం గురించి తీవ్ర విమర్శలు చేయగా.. అది వాడీవేడీ రాజకీయ చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. ఇలా రోజురోజుకీ బాలీవుడ్‌లో మారుతోన్న పరిణామాల గురించి నటి తాప్సీ స్పందించారు. కంగన, రియా చక్రవర్తి గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఓ వ్యక్తి తరచూ వివాదస్పదంగా మాట్లాడితే కొన్నిరోజుల తర్వాత వారి మాటలు ఎవరిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించవు. అలాగే కంగన మాటలు నన్ను ఏవిధంగాను కదిలించలేవు సరికాదా నాపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేవు. రియా చక్రవర్తి ఎవరో నాకు తెలియదు. ఆమెతో నాకు ఎటువంటి పరిచయం లేదు. సుశాంత్‌ సింగ్ అనుమానస్పద మృతి కేసులో ఆమెను టార్గెట్‌ చేసుకుని జరుగుతున్న అన్యాయాన్ని చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే.. బాలీవుడ్‌ సెలబ్రిటీలు చాలామంది ఏదో ఒక సమయంలో తప్పుచేశారు. కానీ వారెవర్ని కూడా రియాని చూసినట్లు చూడలేదు.’ అని తెలిపారు.