NRI-NRT

5286 ప్రవాస భారతీయులు మృతి

5286 ప్రవాస భారతీయులు మృతి

కరోనా నేపథ్యంలో విదేశాల్లో మరణించిన భారతీయుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు విదేశాంగశాఖ సహాయ మంత్రి మురళీధరన్ లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ మొదలైన నేపథ్యంలో ఫిబ్రవరి 1 – ఆగస్ట్ 15 మధ్య కాలంలో సుమారు 5,286 మంది భారతీయులు విదేశాల్లో మరణించినట్లు తెలిపారు. ఇందులో సుమారు 2,360 మరణాలు ఒక్క సౌదీ అరేబియాలోనే నమోదయ్యాయని చెప్పారు. యూఏఈలో 1441 మంది భారతీయులు మరణించగా.. కువైట్‌లో 694 మంది, ఒమన్‌లో 336 మంది, ఖతర్‌లో 238 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. బహ్రెయిన్‌లో 176 మంది భారత పౌరులు మృత్యువాతపడితే.. చైనాలో 20 మంది, జపాన్‌లో 14 మంది భారతీయులు మరణించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. అంతేకాకుండా సుమారు 6000వేల మంది భారతీయులు కరోనా నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్నట్లు మంత్రి వెల్లడించారు.