Food

సువాసనే కాదు ఆరోగ్యం కూడా!

సువాసనే కాదు ఆరోగ్యం కూడా!

సువాసనను ఇచ్చేవాటిలో బిర్యానీ ఆకు కీలకమైంది. బిర్యానీలో తప్ప మిగతా వంటల్లో వాడని ఈ ఆకులో ఎన్నో ఆరోగ్య సుగుణాలున్నాయి. వాటిని రోజూ వంటల్లో వాడితే ఆరోగ్యానికి ఎలాంటి మంచి జరుగుతుందంటే..బిర్యానీ ఆకులను రోజూ మనం తినే ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఇన్ఫ్లమేషన్కు కారణమయ్యే ‘ఇంటర్ల్యూకిన్’ అనే ప్రొటీన్ను వ్యాధి నిరోధక వ్యవస్థ స్వల్ప పరిమాణాల్లో విడుదల చేస్తూ ఉంటుంది. బిర్యానీ ఆకు తరచుగా తీసుకుంటే ఈ ప్రొటీన్ విడుదల తగ్గుతుంది.చెడు కొలెస్ట్రాల్, చక్కెరలను తగ్గించి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తయారయ్యేలా బిర్యానీ ఆకు తోడ్పడుతుంది. తరచూ వంటకాల్లో బిర్యానీ ఆకును వాడడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు, ప్రధానంగా ‘కొలోరెక్టల్’ క్యాన్సర్ ముప్పు తప్పుతుంది.నిద్రపోయే సమయంలో దిండు పక్కనే తువ్వాలు మీద రెండు చుక్కల బే లీఫ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి పడుకుంటే.. హాయిగా నిద్రపడుతుంది. ఉదయాన్నే కొత్త ఉత్సాహంతో నిద్ర లేస్తారు కూడా.బిర్యానీ ఆకుల పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకొని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తాగితే రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. బిర్యానీ ఆకుల్లో మధుమేహాన్ని తగ్గించే గుణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. టైప్-2 డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.సహజసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు బిర్యానీ ఆకులో ఉంటాయి. కొన్ని బిర్యానీ ఆకులు, ఆముదం చెట్టు ఆకులను తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. నొప్పిగా ఉన్న చోట రాసి 20 నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా వారం రోజులు చేస్తే నొప్పులు తగ్గుతాయి.