DailyDose

కోయంబేడు మార్కెట్ తిరిగి తెరుచుకుంటోంది-TNI బులెటిన్

కోయంబేడు మార్కెట్ తిరిగి తెరుచుకుంటోంది-TNI బులెటిన్

* భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది..◆తాజాగా 24గంటల్లో నిన్న ఒక్కరోజే అత్యధికంగా 97,894 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి…దీంతో గురువారం ఉదయానికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 51,18,254 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది…గడిచిన 24గంటల్లో 1,132 మంది ప్రాణాలు కోల్పోయారు… దింతో దేశవ్యాప్తంగా కొవిడ్‌ సోకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 83,198 కి చేరింది..◆కొవిడ్‌ సోకిన వారిలో ఇప్పటివరకు 40,25,080 మంది కోలుకోనీ డిశ్చార్జ్ కాగా..దేశంలో మరో 10,09,976 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది..◆దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య 40 లక్షల పై మంది పెరుగుతున్నప్పటికీ..ఇంకా 10 లక్షలకు పైగా బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

* స్థానిక కోయంబేడు మార్కెట్‌ను దశలవారీగా పునః ప్రారంభించేందుకు సీఎండీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా ఆ మార్కెట్‌లో 492 కిరాణా దుకాణాలను ఈనెల 18 నుంచి తెరిచేందుకు అధికారులు అనుమతిచ్చారు. దీంతో బుధవారం ఆ కిరాణా దుకాణాలకు వ్యాపారులు లారీల్లో సరకులను దిగుమతి చేసుకున్నారు. ఏప్రిల్‌ 27న కొంత మంది వ్యాపారులకు పాజిటివ్‌ లక్షణాలు బయటపడటంతో కోయంబేడు మార్కెట్‌‌ను మూసివేశారు. పూందమల్లి సమీపంలోని తిరుమళిసై మైదానంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేసి వ్యాపారులను అక్కడికి తరలించారు. పూలు, పండ్ల దుకాణాలను మాధవరం బస్‌స్టేషన్‌ ప్రాంతానికి మార్చారు. లాక్‌ డౌన్‌లో సడలింపుల నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనల మధ్య కోయంబేడు మార్కెట్‌లో కిరాణా సరకుల దుకాణాలు ప్రారంభించనున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ సంఖ్య 6లక్షలు దాటేసింది. గడిచిన 24గంటల్లో 77,492 శాంపిల్స్‌ పరీక్షించగా.. 8702 మంది కొవిడ్‌ బారిన పడగా.. 72 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 10,712 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు వైద్యశాఖ అధికారులు బులెటిన్‌లో పేర్కొన్నారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,01,462కి చేరింది. వీరిలో 5,08,088 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 5177 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 88197 క్రియాశీల కేసులు ఉన్నాయి.

* తనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు భార్యకు అబద్ధం చెప్పిన భర్త ప్రియురాలి దగ్గరకు చేరిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబయికి చెందిన వ్యక్తి జులై 21న తన భార్యకు ఫోన్‌ చేసి కరోనా వచ్చినట్లు చెప్పాడు. తాను ఇండోర్‌ వెళ్తున్నానని ఇక తనకు బతకాలని లేదని చెప్పి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. అతని బైకు, హెల్మెట్‌, పర్సును స్థానికంగా ఉండే వాషీ ఏరియాలో గుర్తించారు.