DailyDose

హిందూ దేవాలయాలపై కొనసాగుతున్న విధ్వంసం-నేరవార్తలు

హిందూ దేవాలయాలపై కొనసాగుతున్న విధ్వంసం-నేరవార్తలు

* నంది విగ్రహం ధ్వంసం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు…కృష్ణాజిల్లా వత్సవాయి మండలం మక్కపేట లో ఈరోజు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన నంది విగ్రహం ధ్వంసం కేసులో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టాయి.జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో ఒక బృందం, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెండో బృందంగా ను, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మరో బృందంగా ఏర్పడి పరిశోధన మొదలు పెట్టారు.గతంలో వివిధ దేవాలయాల్లో చోరీ చేసిన నేరస్తులను ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తున్నట్లు సిఐ తెలిపారు.ఈ సంఘటన ఎవరైనా ఆకతాయిగా చేసిందా, మరే ఇతర కారణాల వల్ల చేస్తుందన్న దానిపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు.

* ఉంగుటూరు మండలం నాచుగుంట సమీపంలో, రోడ్డు ప్రమాదం. బెంగళూరుకు చెందిన కాళీ ట్రావెల్స్ బస్సు. అదుపు తప్పి లారీని వెనకి నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి. మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని, క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు కలకత్తా నుండి బెంగళూరుకు వలస కూలీలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

* ప్రతీ పోలీస్ స్టేషన్ లోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు..!!★ సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది.★ ప్రతి పోలీస్ స్టేషన్లలోను సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.★ అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది.★ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి.★ అధికారం ఉన్నవారికి.. డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ముకాస్తూ.. సమాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు మాత్రం పోవటంలేదు.★ కొన్ని పీఎస్ లు ఏకంగా సెటిల్ మెంట్లకు అడ్డాగా మారుతున్నాయి.★ లాకప్ డెత్, బెదరింపులు, వసూళ్లు, అక్రమార్కులకు అండాదండ ఆరోపణలతో ఆ వ్యవస్థపై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది.★ కొన్ని సందర్భాల్లో పీఎస్ లలో జరుగుతున్న సందర్భాలు లేకపోలేదు.★ ఏపీలో ఓ దళితుడికి స్టేషన్‌లో శిరోముండనం చేయించడం కలకలకం రేపిన తెలిసిందే.★ కొన్ని స్టేషన్‌లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరగుతుంటాయి.★ ఏకంగా మద్యం తాగి పోలీసులే చిందులు వేయటం చూశాం.★ ఇలా పీఎస్ లలో జరిగేది ప్రతీదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్ధేశ్యంతోను.. తద్వారా సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పీఎస్ ల విషయంలో సుప్రీం కోర్టు జూలు విదిలించింది.★ అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాలు జారీ చేసింది.దీనికి సంబంధించి పనులు ఎంత వరకూ జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది.

* శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ లోని క్రేషర్ క్వారీ నీటి గుంటలో పడి, ఇద్దరు యువకులు మృతి.రాజేంద్రనగర్ శివరాం పల్లికి చేందిన మల్లేష్ (24). జయకృష్ణ (25). మేస్తీ పనికోసం వచ్చిన ఇద్దరు యువకులు.సీనరీ బాగుందని ఫోటోలు తీసుకుని కాళ్ళు కడుకుంటుండగా, ఒక్కసారిగా కాలుజారీ ఇద్దరు క్వారీ నీటి గుంటలో గల్లంతు.మృతదేహాల కోసం గాలిస్తున్న ఆర్జీఐఏ పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఆర్జీఐఏ పోలీసులు.

* తూర్పు గోదావరి జిల్లాలో మరో హిందూ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు.ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గర లో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చేయి విరగ కొట్టిన దుండగులు.దీంతో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు.హనుమాన్ చెయి విరగగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఘటనా స్థలానికి వెళ్లి విగ్రహాన్ని పరిశీలించిన తెలుగుదేశం పార్టీ తూ.గో.జిల్లా తెలుగు యువత ఉప అధ్యక్షులు పైల సుభాష్ చంద్రబోస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు.