Health

పదునైన మెదడుకు ఇవి తప్పనిసరి

పదునైన మెదడుకు ఇవి తప్పనిసరి

శారీరిక ఆరోగ్యంలో మెదడు కీలకపాత్ర పోషిస్తుంది. మెదడు సమస్యలు గుర్తించగలిగే లక్షణాలను కలిగిలేని కారణంగా, వాటిని విస్మరించడం జరుగుతుంటుంది. కానీ, కాలక్రమేణా తీవ్ర పరిస్థితులకు దారితీస్తుంది. కావున, మెదడు ఆరోగ్యం పరంగా దృష్టిసారించడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారుమీ మెదడు ఆరోగ్యానికి సరైన నిద్ర, మరియు ఇతర విశ్రాంతి కార్యకలాపాలు కీలకపాత్ర పోషిస్తాయని లైఫ్ స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హో సూచిస్తున్నారు. మీవయస్సు ప్రకారం మెదడు నుండి ఆశించదగిన పనితీరును నిర్ధారించే కొన్ని చిట్కాలను ఇక్కడ పొందుపరచడం జరిగిందిమీ మెదడు ఆరోగ్యానికి సరైన నిద్ర, మరియు ఇతర విశ్రాంతి కార్యకలాపాలు కీలకపాత్ర పోషిస్తాయని లైఫ్ స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హో సూచిస్తున్నారు. మీవయస్సు ప్రకారం మెదడు నుండి ఆశించదగిన పనితీరును నిర్ధారించే కొన్ని చిట్కాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది.
**మెదడు ఆరోగ్యానికి చిట్కాలు..
మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవటానికి ఇదే సరైన సమయం. సంవత్సరం ప్రారంభంలో, మీ ఆరోగ్యం, రోగనిరోధకశక్తి, ఫిట్‌నెస్ మెరుగుపరచడానికి మీరు తీసుకోవలసిన చర్యల గురించి ఆలోచించడానికి ఖచ్చితంగా కొంత సమయం కేటాయించడం తప్పనిసరి. క్రమంగా ఈవ్యాసంలో, మెదడు ఆరోగ్యంపై దృష్టిసారించడం జరిగింది. “మీ మెదడు, శరీరంలో సమాచార మార్పిడికి కేంద్రబిందువుగా ఉంటుంది” అని లైఫ్ స్టైల్ కోచ్ లూక్ కౌటిన్హో తన ఇటీవలి ఫేస్బుక్లో లైవ్ సెషన్లలో చెప్పారు. అంతేకాకుండా ప్రజలు మెదడు ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారని కూడా అతను పేర్కొన్నాడు. ప్రధానంగా మెదడు ఆరోగ్యానికి నష్టం, లేదా మెదడు పనితీరు మందగించేలా ప్రభావితమయ్యే స్పష్టమైన లక్షణాలు కనపడని కారణంగా ఇలా విస్మరించడం జరుగుతుంటుందని చెప్పారు. ఏదిఏమైనప్పటికీ, మీరు నిద్రపోతున్నప్పుడు కూడా నిరంతరం పనిచేసే ప్రధాన అవయవాలలో ముఖ్యమైనది మెదడు అని గ్రహించాలి, మరియు జాగ్రత్త వహించాలి, అని లూకా పేర్కొన్నారు.
*మెదడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ల్యూక్ 10 చిట్కాలను సూచిస్తున్నారు.
మీ చర్మం, జుట్టు, కళ్ళు, ఊపిరితిత్తులు, కాలేయం మరియు ఇతర అవయవాల మాదిరిగానే, ఆరోగ్యకరమైన ఆహారమనేది మీ మెదడు యొక్క వాంఛనీయ పనితీరుకు సహాయపడుతుంది. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికీ, అధిక సమాచార మార్పిడి, ఒత్తిడి, భావోద్వేగాల కారణంగా మీ మెదడు సరిగా పనిచేయని స్థితికి చేరుకుంటుంది.
1. బ్రెయిన్ డిటాక్స్ కోసం నిద్ర
మెదడులోని వ్యర్థాలను తొలగించే వ్యవస్థను జిలిమ్‌ఫాటిక్ వ్యవస్థ అని వ్యవహరించడం జరుగుతుంది. మీరు నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే ఈ సిస్టమ్ పనిచేస్తుంది. “మీరు నిద్రపోతున్నప్పుడు, మెదడు దాని అసలు పరిమాణానికి దాదాపు 60% తగ్గిపోతుంది. ఇది మీ కణాల మధ్య ఖాళీలను వదిలివేస్తుంది. సెరిబ్రల్ వెన్నెముక ద్రవం కణాల మధ్య ప్రవహించటానికి మరియు మెదడులోని విషాన్ని శుభ్రపరచడానికిగాను ఇలా కొంత స్థలాన్ని వదిలివేస్తుంది. ఈ క్రమంలో భాగంగా మీరు నిద్రపోయే సమయం కూడా మెదడు డిటాక్సిఫికేషన్(విషతుల్య రసాయనాలను తొలగించడం) పరంగా ఎంతో ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది. ఎక్కువకాలం నిద్రలేమితో బాధపడుతున్న వారిలో మెదడు పనితీరు కూడా తగ్గుముఖం పడుతుంది. లూకా సూచనల ప్రకారం, ఆరోగ్యకరమైన మెదడు పనితీరు దృష్ట్యా, మంచి నాణ్యతతో కూడిన లోతైన నిద్రను అనుసరించవలసి ఉంటుంది.
2. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు
మెదడు ఆరోగ్యానికి సూచించదగిన ముఖ్యమైన పోషకాలలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ ప్రధానమైనవి. అవిసెగింజలు, చియా విత్తనాలు, అక్రోట్లు, సాల్మన్, మాకరెల్, ట్యూనా మరియు సార్డినెస్ వంటి చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను అధికంగా కలిగి ఉండే ఆహారాలకు ఉదాహరణలుగా ఉన్నాయి.
3. ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు
తక్కువ కొవ్వులుగల, మరియు జీరో-ఆయిల్ వంట పద్ధతులకు, ఆహార ప్రణాళికలకు దూరంగా ఉండండి. వాంఛనీయ మెదడు ఆరోగ్యానికి కొన్నిరకాల కొవ్వులు ఖచ్చితంగా అవసరం. కొబ్బరినూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్ మరియు ఆవనూనె వంటివి ఆరోగ్యకర కొవ్వుల వనరులుగా ఉన్నాయి. ఇవి మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. డీప్ ఫ్రైడ్, జంక్, నిల్వ(ప్రాసెస్) చేయబడిన ఆహారాలలో అనారోగ్య కొవ్వునిక్షేపాలు అధికంగా ఉంటాయి. కావున వాటిని నివారించండి. మీరు మెదడు ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తున్నవారైతే, ఆరోగ్యకరమైన కొవ్వులు మీఆహారంలో భాగంగా ఉండాలని గుర్తుంచుకోండి.
4. ఆకుకూరలు
మీ మెదడు ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఆకుకూరలు మీ కళ్ళు, చర్మం, జుట్టు వంటి ఎన్నో ఇతరత్రా భాగాలకు కూడా ముఖ్యమైనవిగా సూచించబడుతాయి. ఆకుపచ్చని కూరగాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి, క్రమంగా బరువు తగ్గుదలలో కూడా సహాయపడగలవు. బచ్చలికూర, బ్రకోలీ, కాలీఫ్లవర్, ముల్లంగి, కాలే మరియు మెంతికూర వంటి కూరగాయలు మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి.
5. పండ్లు, ముఖ్యంగా బెర్రీలు
ప్రతిరోజూ సీజన్‌లో దొరికే పండ్లను ఖచ్చితంగా తీసుకోండి. లూకా సూచనల ప్రకారం బెర్రీస్ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఆరోగ్యకరమైన మెదడు కోసం వాటిని క్రమంతప్పకుండా అనుసరించండి.
6. బ్లాక్ కాఫీ మరియు టీ
ఇది కాఫీని ఇష్టపడే వారికి మాత్రమే. చక్కెర, పాలు, సిరప్,ఇతరత్రా ఫ్లేవర్స్ లేకుండా తీసుకునే బ్లాక్ కాఫీ మీ మెదడుకు మేలు చేస్తుందని లూకా చెప్పారు. కానీ ఖాళీ కడుపుతో మాత్రం కాఫీ తీసుకోరాదని చెప్పబడుతుంది. ఒక రోజులో 1, 2 కప్పుల కాఫీ తీసుకోవడం, మీ మెదడు ఆరోగ్యానికి మంచిది. గ్రీన్-టీ మరియు బ్లాక్ టీ కూడా మెదడుపై ఉత్తమ ప్రభావాలను కలిగి ఉంటాయి. వాటిని అతిగా వినియోగించనంత కాలం.
7. పసుపు
ఈ మసాలా దినుసు మీ మెదడు ఆరోగ్యానికి అద్భుతమైనదిగా చెప్పబడుతుంది. పసుపు యొక్క శోషణను మెరుగుపరచడానికి, నల్ల మిరియాలు మరియు ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి వంటి కొవ్వులతో కలిపి తీసుకోవడం మంచిది. ఈ టానిక్ మీ మెదడు, రోగనిరోధకశక్తి, చర్మం, కళ్ళు, జుట్టు, కాలేయం వంటి ఎన్నో అంశాలపరంగా సహాయం చేస్తుంది.
8. వ్యాయామం
మీరు ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే, మీ మెదడు ఆరోగ్యానికి అంత మంచిదిగా చెప్పబడుతుంది. వారంలో కనీసం 5 మార్లు 15 నుండి 30 నిమిషాలు లేదా అంతకన్నా ఎక్కువగా(వీలైతే) వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి.
9. ప్రకృతితో సన్నిహితంగా ఉండండి
ప్రకృతి మీకు విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా, ప్రశాంతతకు సహాయపడుతుంది. మీ మెదడును ఒత్తిడి లేకుండా నిర్వహించేందుకు ప్రతిరోజూ ప్రకృతికి కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి.
10. విశ్రాంతి
ధ్యానం, యోగా, ఇష్టమైన వ్యక్తులతో సంభాషణల వంటి అంశాల ద్వారా మీ మెదడుకు ఒక సడలింపును ఇవ్వండి. సోషల్ మీడియాలో వెచ్చించే సమయాన్ని తగ్గించడం మంచిది. సోషల్ మీడియా అలవాటు, ఖచ్చితంగా మీ మెదడు పనితీరును తగ్గిస్తుందని లూకా చెప్తున్నారు.