Movies

అక్టోబరులో ఆలియా ఆగమనం

అక్టోబరులో ఆలియా ఆగమనం

లాక్‌డౌన్‌ సడలింపుతో సినిమా పరిశ్రమలో కదలిక మొదలైంది. ఇప్పటికే కొన్ని చిత్రాలు సెట్స్‌లో సందడి చేస్తున్నాయి. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో పెద్ద సినిమాలు కూడా షూటింగ్‌కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం రాజమౌళి కొత్త షెడ్యూళ్లు వేస్తున్నారట. అన్నీ కుదిరితే ‘అక్టోబర్‌’లో షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నవంబర్‌లో సెట్‌లో అడుగుపెడతారని వినికిడి. అయితే ఈ చిత్రం నుంచి బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియాభట్‌ తప్పుకొన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. నవంబర్‌లో అలియా సెట్‌లో అడుగుపెడుతున్నట్లు, ఆ మేరకు షెడ్యూల్‌ ప్లాన్‌ చేసినట్టు తాజా సమాచారం. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.