Health

కరోనా వచ్చిందో…3నెలలు సంసారం బందే!

Couples Must Stay Away If Either One Catches COVID19

డిశ్చార్జ్ అయినవారిలో లంగ్ ఫైబ్రోసిస్, షుగర్ లెవెల్ లు, తీసుకోవలసిన ఆహారం, శృంగారం, AC రూములలో కొరోనా వ్యాప్తి గురించిన వాటి గురించిన అవగాహన

1) ప్రశ్న: సర్ కోవిడ్ పాజిటివ్ వచ్చి రికవర్ అయిన కొంతమంది పేషెంట్స్ లో లంగ్ ఫైబ్రోసిస్( ఊపిరితిత్తుల కణజాలం యొక్క భాగాలు గట్టి పడటం లేదా మచ్చలు ఏర్పడటం)కనపడుతోంది..దీనిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా ఉన్నాయా??

సమాధానం : by doctor Suresh Anne MD pulmonologist USA : ఇప్పుడైతే మనకు స్టెరోయిడ్స్ తప్పించి వేరే మార్గం లేదండీ..స్టెరోయిడ్స్ ఉపయోగించి, ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడం ద్వారా తర్వాత వచ్చే పర్యవసానాలను తగ్గించుకోవచ్చు..కొన్ని చోట్ల మామూలు ఫైబ్రోసిస్ కి ఇచ్చే కొన్ని మెడిసిన్స్ (పెర్ఫెనిడోన్) ఇస్తున్నారు గానీ, కోవిడ్ ఫైబ్రోసిస్ లో వాటి ప్రభావం ఏంటి అనేది ఇంకా పరిశీలనాత్మకంగా తెలుసుకోవాల్సి ఉంది..

Dr.C.Prabhakara Reddy : ఇంతకుముందు SARS మొదలగు జబ్బులలో ఫైబ్రోసిస్ వచ్చినపుడు పెర్ఫెనిడోన్ అనే మందులు వాడారు. ఎందుకయినా మంచిది అని కోవిడ్ లో కూడా కొందరు పల్మనాలజిస్టులు వాడుతున్నారు. కాని అది కోవిడ్ లో పనికి వస్తుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. చైనాలో కొందరికి మంచి ఫలితం ఉంది అంటున్నారు. ఇంకా ఈ మందుకు అనుమతి లేదు.

2) ప్రశ్న:సర్ మా పేరెంట్స్ ఇద్దరికి నెల క్రితం కోవిడ్ పాజిటివ్ వచ్చింది..15 రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు..
ట్రీట్మెంట్ సమయంలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ 400కి టచ్ అయ్యాయి..డిశ్చార్జ్ అయినప్పటికీ ఇప్పుడు కూడా 220 ఉంది.. మళ్లీ షుగర్ లెవెల్స్ మామూలు కావడానికి ఎంత సమయం పడుతుంది?ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి??

సమాధానం: షుగర్ లెవెల్స్ పెరగడానికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి..

1.స్టెరోయిడ్స్ వాడటం వల్ల

2.వైరస్ ప్రభావం పాంక్రియాస్ మీద పడటం వల్ల..

3.బాడీ లో ఇన్ఫ్లమేషన్ వున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టన్స్ పెరుగుతుంది..

దీని ద్వారా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి..

కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గించాలి..తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం ఆక్టివిటీస్ పెంచుకుని, డాక్టర్ ని అడిగి డయాబెటిస్ కి ట్రీట్మెంట్ తీసుకోవాలి..షుగర్ లెవల్సు డిశ్చార్జ్ తరువాత మానిటర్ చేసుకుంటుండాలి. ఇన్ఫ్లమేషన్ కంట్రోలు కు వచ్చి CRP లెవల్సు తగ్గిన తరువాత ఆటోమేటిక్ గా కంట్రోలు అయిపోతాయి.

3) ప్రశ్న: సర్ AC రూమ్స్ లో ఉండటం వల్ల కోవిడ్ వచ్చే అవకాశం ఉందా??

సమాధానం:AC రూమ్స్ లో వున్నప్పుడు గాలి సర్కులేషన్ ద్వారా, తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వైరస్ వ్యాప్తి ఆ తుంపరల ద్వారా ఆ రూములో ఎవరికైనా కోవిడ్ ఉంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ..అంతే గానీ, కేవలము AC లో ఉండటం వల్లనే కొరోనా రాదు..

4)ప్రశ్న : ఫుడ్ విషయంలో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?

సమాధానం : అన్నీ రకాల ఫుడ్ తీసుకోవచ్చు.. మసాలా ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లెమ్ రావచ్చు. సరైనా ఆహారం సులభంగా జీర్ణము అయ్యేది తీసుకోవాలి. వెజిటేరియన్ మంచిది. గుడ్లు, చేప లైట్ గా జీర్ణక్రియ జరిగేవి తీసుకోవాలి.

5) ప్రశ్న: డిశ్చార్జ్ అయిన వారు శృంగారం విషయంలో ఎలాంటి జాగ్రత్తగా ఉండాలి?

సమాధానం: డిశ్చార్జ్ అయిన వారు వేరొకరికి ఇన్ఫెక్టివ్ కారు, కొరోనా రాదు. కాని శృంగారం లో గుండె ఊపిరి తిత్తులు ఎక్కువ వత్తిడి కి లోను అవుతాయి. అవి 4 రెట్లు ఎక్కువ సామర్థ్యం తో పనిచేయాలి అది సాధ్యంకాదు. ఆయాసము మరియు పల్సు రేటులో హెచ్చుతగ్గులు వస్తాయి. కావున 3 నెలల పాటు శృంగారం నిషిద్ధం.

కొరోనా కంటే కొరోనా భయమే ప్రమాదకరమైనది. అవగాహన పెంచుకోండి. భయాన్ని పారద్రోలండి.

LET BREAK THE SILENCE, DISCUSS ABOUT COVID AND BANISH THE FEAR OF COVID

Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్,
కోవిడ్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేక అధికారి