DailyDose

ఆహారం తీసుకుంటున్న బాలు-TNI కరోనా బులెటిన్

India COVDI19 Stats Latest - SPB Recovering And Taking Food

* రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 10,820 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోవిడ్‌ విజేతల సంఖ్య 5,30, 711కు చేరుకుంది. ఇక రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య జోరుగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 74,595 శాంపిళ్లను పరీక్షించగా, 8,218 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ టెస్టుల సంఖ్య 50,33,676కు చేరుకోగా, మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 617776కు చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 81763 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రంలో కొత్తగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 58గా నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ మరణాల సంఖ్య 5302కు చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

* దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ నిత్యం కోలుకుంటున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 95వేల మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రోజువారీగా పాజిటివ్‌ కేసులు భారీస్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 8,81,911 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా వీటిలో 93,337 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో శనివారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 53,08,014కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 42లక్షల మంది కోలుకోగా, మరో 10లక్షల 13వేల యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా సోకి మరణిస్తున్న వారిసంఖ్య పెరుగుతూనే ఉంది.

* కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. నిన్నటి నుంచి ఆయన ఆహారం తీసుకుంటున్నారని, రోజులో 15-20 నిమిషాలు వైద్యుల సాయంతో లేచి కూర్చొంటున్నారని తెలిపారు. ఈ మేరకు ఎస్పీబీ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ప్రత్యేక వీడియో సందేశంలో పంచుకున్నారు.