DailyDose

అమెరికాలో కాల్పులు.ఇరువురు మృతి-నేరవార్తలు

అమెరికాలో కాల్పులు.ఇరువురు మృతి-నేరవార్తలు

* అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్ సమీపంలోని రోచెస్టర్లో ఒక పార్టీలో జరిగిన ఈ ఘటనలో ఇరువురు ప్రాణాలు కోల్పోగా 14మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడినట్టు సమాచారం.

* దేశంలో ఉగ్ర దాడులకు కుట్రపన్నిన ఆల్‌ఖైదా ఆపరేటర్లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్ట్‌ చేసింది.ఇంటిలిజెన్స్‌ వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఎన్‌ఐఏ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది.ఈ మేరకు శనివారం ఉదయం బెంగాల్, కేరళలో 11 మంది ఆల్‌ఖైదా ఆపరేటర్లను అరెస్ట్ చేసింది.కేరళ, బెంగాల్‌ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడికల్స్‌ను అధికారులు విచారిస్తున్నారు.దేశంలోని ముఖ్య పట్టణాల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఈ బృందం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది.వీరి నుంచి మరింత సమచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు..

* విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చింతపల్లి మండలం చిలకల మామిడి వీధి శివారులో శివాలయం విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు

* తమ కుమార్తె మృతికి కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుమేధ (12) తల్లిదండ్రులు అభిజిత్‌, సుకన్య పోలీసులను కోరారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరేడ్‌మెట్‌కు చెందిన చిన్నారి సుమేధ స్నేహితులతో ఆడుకొని వస్తానంటూ ఇంట్లో చెప్పి నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదం నింపిన విషయం తెలిసిందే. సుమేధ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనలో సంబంధిత మున్సిపల్‌ ఇంజినీర్లు ఏఈ, డీఈలపై కేసు నమోదు చేస్తామని నేరేడ్‌మెట్ సీఐ నరసింహస్వామి చెప్పారు. తమ కుమార్తెలా ఇంకెవరూ బలికాకుండా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని సుమేధ తల్లిదండ్రులు కోరుతున్నారు.

* మాదకద్రవ్యాల కేసు మరో ముగ్గురి మెడకూ చుట్టుకుంది. నటుడు, వ్యాఖ్యాత అకుల్‌ బాలాజీ, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.వి.దేవరాజ్‌ తనయుడు ఆర్‌.వి.యువరాజ్‌, కొన్ని కన్నడ చిత్రాల్లో నటించిన కథానాయకుడు సంతోశ్‌కుమార్‌లకు సీసీబీ పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం పది గంటలకు తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాను హైదరాబాద్‌లో ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు మరికొంత గడువు కావాలని అకుల్‌ బాలాజీ కోరారు. విమానంలో రావాలని అధికారులు చేసిన సూచనలతో, ఆయన నేడు నగరానికి రానున్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, వ్యాఖ్యాతగా వ్యవహరించిన పలు తెలుగు, కన్నడ కార్యక్రమాల్లో నటీనటులు పాల్గొంటున్న నేపథ్యంలోనే నోటీసులు జారీ చేసి ఉంటారని ఆయన పేర్కొన్నారు.