WorldWonders

అమెరికాలో వేపపుల్ల ₹1000

Demand For Neem Stick In USA Is High - 15Dollars For A Pack

వేప చెట్లు మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. పల్లెటూళ్లలో అయితే లెక్కకు లేనని చెట్టు మనకు కనపడతాయి. ఆయుర్వేద మందులకు చక్కటి ఔషధం వేప. అలాగే వేప పుల్లలు పల్లెటూళ్లలో పళ్లు తోముకోవడానికి కూడా ఉపయోగిస్తారు. పల్లెటూరిలో పుట్టిపెరిగిన ప్రతిఒక్కరూ ఏదో ఒకరోజు వేప పుల్లను పళ్లు తోముకోవడానికి ఉపయోగించి ఉంటారు. అసలు వేప పుల్లల గురించి ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనకు విచ్చలవిడిగా దొరికే వేప పుల్లలు అమెరికాలో డబ్బులు పెట్టి కొంటారట! అమెరికాలో వేప పుల్లలకు బాగా డిమాండ్‌ ఉంది. ఓ పది వేప పుల్లలను అమెరికా సూపర్‌ మార్కెట్లో 15 డాలర్లకు అమ్ముతున్నారు. ఈ మేరకు సియట్‌ కంపెనీ చైర్మన్‌ హర్ష గోయెంగా చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 15 డాలర్లు అంటే దాదాపు 1000 రూపాయలు. ప్రస్తుతం అందరూ టూత్‌ పేస్టులకు అలవాటు పడ్డారు. కరోనా రావడంతో మళ్లీ పాత అలవాట్లకే అలవాటు పడుతున్నారు. అందుకే అమెరికాలో పళ్లు తోముకోవడానికి వేప పుల్లలు వాడుతున్నారు.