Movies

మీ ఆశీర్వాదం అడుగుతున్న రేణు దేశాయి

మీ ఆశీర్వాదం అడుగుతున్న రేణు దేశాయి

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ రీఎంట్రీపై ఇప్ప‌టికే చాలా సార్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రేణూదేశాయ్ ఫాలోవ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ యాక్టింగ్ చేయ‌నున్నారు రేణూదేశాయ్‌. కృష్ణ‌మామిడాల డైరెక్ష‌న్ లో వ‌స్తున్న వెబ్ సిరీస్ లో రేణూ దేశాయ్ న‌టిస్తున్నారు. వ‌చ్చే నెల‌లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ షురూ కానుంది. ఈ విష‌యాన్ని రేణూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది.

మ‌ళ్లీ కెమెరా ముందుకొస్తున్నాను. నేను ఓ అంద‌మైన వెబ్ సిరీస్ కు సంత‌కం చేశాన‌ని ప్ర‌క‌టిస్తున్నందుకు సంతోషంగా, ఎక్జ‌యిటింగ్ గా ఉంది. వ‌చ్చే నెల‌లో షూటింగ్ మొద‌ల‌వుతుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తా. స‌త్యాన్వేష‌ణ‌లో ఉన్న ఓ మ‌హిళాప్ర‌యాణానికి మీ దీవెన‌లు, ప్రేమ‌ను అందించాల‌ని కోరుతున్నాన‌ని పోస్ట్ లో పేర్కొంది.