Fashion

మెడలో పాము వేసుకో…అదే అందమని మురిసిపో!

Snake Necklace - Telugu Fashion News

‘అమ్మో… పామే… చూస్తేనే కలలోకొస్తుంది’ అని భయపడుతుంటారు కొందరు. కానీ పరమేశ్వరుడిలా ఆ పామునే తెచ్చి మెడలో అలంకరించుకుంటే అందమైన కంఠాభరణమై అందరినీ ఆకర్షిస్తుంది అంటున్నారు నయా జ్యువెలరీ డిజైనర్లు. అందుకే కోరల్‌, కింగ్‌, కోబ్రా… ఇలా రకరకాల పాముల్ని పోలిన పెండెంట్‌ నెక్లెస్సుల్ని అందమైన రాళ్లతో రూపొందిస్తున్నారు. అంతేనా… విషానికి విషమే విరుగుడు అన్నట్లు పాము భయం పోవాలంటే ఈ స్నేక్‌ లాకెట్లను వేసుకుంటే భయమూ పోతుంది, ఫ్యాషన్‌గానూ ఉంటుంది మరి. ఏమంటారు?