Politics

రైతుల ఆనందాలు ఎక్కడ మరి?

KTR Questions Farmer's Happiness On Agri Bill

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అగ్రిక‌ల్చ‌ర్ బిల్లులు చారిత్రాత్మ‌క‌మే అయితే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవ‌డం లేదు? అని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్‌డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయ‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. గ‌త వారంలో కొత్త రెవెన్యూ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన‌ప్పుడు రైతులంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు. రాష్ర్ట వ్యాప్తంగా ఊరురా రైతులంద‌రూ సంబురాల్లో మునిగితేలార‌ని అని కేటీఆర్ గుర్తు చేశారు. తాము రైతు స్నేహ‌పూర్వ‌క రెవెన్యూ బిల్లును ప్ర‌వేశ‌పెట్టామ‌ని కేటీఆర్ తెలిపారు. రైతుల‌కు మేలు చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త రెవెన్యూ బిల్లును రూపొందించిన‌ విష‌యం తెలిసిందే. ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం లభించే దిశ‌గా రూపొందించిన ఈ చ‌ట్టానికి రైతులంద‌రూ వినూత్న రీతిలో మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టాల‌కు క్షీరాభిషేకం చేస్తున్నారు. ఎడ్ల బండ్లు, ట్రాక్ట‌ర్ల‌తో భారీ ర్యాలీ నిర్వ‌హించి.. సీఎం కేసీఆర్ ప‌ట్ల త‌మ కృత‌జ్ఞ‌త‌ను చాటుకుంటున్నారు. రైతుల సంక్షేమ‌మే ధ్యేయంగా ముందుకెళ్తున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి రైత‌న్నలంతా అండ‌గా ఉంటున్నారు. కేసీఆర్ జ‌య‌హో అంటూ అన్న‌దాత‌లు నిన‌దిస్తున్నారు.