Movies

ప్రస్తుతానికి RRR సంగీతం చేయట్లేదు

MM Keeravani Updates On RRR Music Compositions

టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌. కోవిడ్-19 ప్ర‌భావంతో షూటింగ్ వాయిదా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్టు చిత్రీక‌ర‌ణ ఎప్పుడెప్పుడు షురూ అవుతుందా..? అని ఎదురుచూసిన అభిమానుల‌కు గుడ్‌న్యూస్. ఆర్ఆర్ఆర్ షూటింగ్ త్వ‌ర‌లోనే మ‌ళ్లీ మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. తాను ప్ర‌స్తుతం క్రిష్ సినిమాతోపాటు కే రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కిస్తోన్న చిత్రాల‌కు ప‌ని చేస్తున్నాన‌ని ట్వీట్ లో పేర్కొన్నారు కీర‌వాణి. ప్రీ ఇండిపెండెన్స్ పీరియాడిక్ డ్రామాగా వ‌స్తోన్న ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్ లీడ్ రోల్స్ పోషిస్తుండ‌గా…..అలియా, అజ‌య్ దేవ్‌గ‌న్ కీల‌క పాత్ర్లో న‌టిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి ఆగ‌స్టులో క‌రోనా బారిన ప‌డి….మ‌ళ్లీ కోలుకున్న విష‌యం తెలిసిందే. క‌రోనా నుంచి ఉప‌శ‌మ‌నం పొందిన త‌ర్వాత కీర‌వాణి రెండు సార్లు ప్లాస్మా దానం చేశారు.