Sports

నాకు బాధ లేదు. నేను అర్హుడినే!

Novac Djokovic Confessions On Instagram Over His Ban

యూఎస్‌ ఓపెన్‌ నుంచి తన నిష్క్రమణ సరైందేనని సెర్బియన్‌ స్టార్‌ షట్లర్‌ నొవాక్‌ జకోవిచ్‌ అన్నాడు. యూఎస్‌ ఓపెన్‌ 2020లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జకోవిచ్‌ వారంరోజుల క్రితం స్పెయిన్‌ ఆటగాడు పాబ్లో కారెనో బస్టాతో ప్రిక్వార్టర్స్‌లో తలపడ్డాడు. ఆ మ్యాచ్‌ సందర్భంగా అతను నిర్లక్ష్యంగా కొట్టిన బంతి లైన్‌ అంపైర్‌కు తగిలింది. అయితే అంపైర్‌ గొంతుకు బంతి బలంగా తాకడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో.. జకోవిచ్‌ను నిబంధనల ప్రకారం టోర్నీ నుంచి తొలగించారు. కాగా టోర్నీ మధ్యలోనే ఓటమి లేకుండానే నిష్క్రమించడాన్ని జకో మళ్లీ గుర్తుచేసుకున్నాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంగా స్పందించాడు. తనకు ఆ శిక్ష సరైందేనని అన్నాడు. ‘దండనకు నేను అర్హుడినే. నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఓ మహిళ తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది’ అని జకో పేర్కొన్నాడు. జకోను టోర్నీ నుంచి బహిష్కరించడంతో పాటు అతను గెలుచుకున్న ప్రైజ్‌మనీ, పాయింట్లు కూడా రద్దు చేశారు.