Business

కర్ణాటకకు టెస్లా?

కర్ణాటకకు టెస్లా?

ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా దృష్టి ఇప్పుడు భారత్‌లోని బెంగళూరుపై పడింది. ఈ సంస్థ పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులతో టెస్లా ప్రతినిధులు ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపినట్లు సమాచారం. టెస్లా వస్తే ఈ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి పెరుగుతుంది. ఇప్పటికే వైమానిక, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాల్లో ఇక్కడ ఆర్‌అండ్‌ డీ సెంటర్లు ఉన్నాయి.