DailyDose

ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన మహిళ-నేరవార్తలు

Telugu Latest Crime News Today - Woman Murders Husband With Lover

* ప్రియుని మోజులో పడి ఏకంగా భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…జిల్లాలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్రీనివాస్ చౌదరికి 9 సంవత్సరాల కింద సరిత అనే మహిళతో వివాహమైంది. వీరికి 7 సంవత్సరాల కూతురు కూడా ఉంది. సరితకు అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం శ్రీనివాస్ కు తెలిసి భార్యను ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడు. భార్య ప్రవర్తన నచ్చని శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో తరచూ భార్యభర్తలకు గొడవలు జరిగేవి. ఆదివారం మరోసారి భర్త తాగి రావడంతో సరిత అతనితో గొడవపడింది. మద్యం మత్తులో ఉన్న అతని పై పప్పు కాడతో తలపై కొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. శ్రీనివాస్ శవాన్ని చెట్టుకు ఉరేసి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రియుడు ప్రభాకర్ తో కలిసి కోడలు సరిత తన కుమారున్ని హత్య చేసిందని శ్రీనివాస్ తండ్రి రామచంద్రప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ప్రస్తుతం ఆ నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

* యువతిపై దాడి.. శేరిలింగంపల్లి కార్పొరేటర్ అరెస్ట్. రాత్రి ఇంటికి వచ్చిన అనన్య కారుకు కార్పొరేటర్ కారు అడ్డంగా నిలిచింది. దీంతో ఆమె కారును కాస్త పక్కకు తీయాలని సెక్యూరిటీని కోరింది. ఈ విషయమై బయటకు వచ్చిన కార్పొరేటర్ అనన్యతో వాగ్వాదానికి దిగారు.

* ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. తీసుకెళ్లి నదిలో తోసేశాడుఅనాథ బాలికను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. కొద్దిరోజులు కాపురం సజావుగా సాగింది. ఇంతలోనే మనస్పర్థలు.. ఆమెను నమ్మించి తీసుకెళ్లి నదిలో తోసేసిన భర్త.. కర్నూలు జిల్లాలో దారుణం.ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. కొన్నేళ్లు భార్యను బాగానే చూసుకున్నాడు. ఇద్దరి మధ్య చిన్న, చిన్న సమస్యలు వచ్చాయి.. కోపంతో ఆమెను నమ్మించి మోసం చేసి నదిలో తోసి చంపేందుకు ప్లాన్ చేశాడు. ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లెకు పత్తి భాస్కర్‌ హైదరాబాదులోని ఇంటెలిజెన్స్‌ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్కడే రామలక్ష్మి అనే అనాథ యువతి బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. వీరిద్దరూ ప్రేమించుకుని 2016లో వివాహం చేసుకున్నారు.

* ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు పాన్ కార్డు, ఆధార్ కార్డులో పుట్టిన తేదీలు మారుస్తున్న నఖిలీ ముఠాను ఏలూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎంపీడిఓ కార్యాలయానికీ వస్తున్న దరఖాస్తులో చాలా వరకు నఖిలీ పత్రాలుగా నిర్ధారించుకున్న తరువాతపోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపిడిఓ.మధీనా ఆన్ లైన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకుడు సిరాజ్ బేగ్ ను అరెస్టు చేసిన పోలీసులు. కంప్యూటర్ హార్డ్ డిస్క్ తో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.

* స్నేహితులతో కలిసి రాజంపేట అన్నమయ్య ప్రాజెక్టు వద్దకు విహారయాత్రకు వెళ్లిన ఖాదర్ బాషా..యువకుడు తిరిగి రాకపోవడంతో పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు.ఈతకోసం నీటిలోకి దిగి తిరిగి రాలేదని తెలిపిన తోడుగా వెళ్లిన యువతి యువకుడు.మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బంధువులు.విచారిస్తున్న రూరల్ ఎస్సై రోషన్.

* అభం శుభం తెలియని అమ్మాయిలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి.ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్నా… కొందరు కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా మైనర్ బాలికను ఓ దుర్మార్గుడు గర్భవతిని చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.