Food

గర్భిణులు నెయ్యి తినవచ్చా?

Can you eat ghee during pregnancy-Telugu food and diet news

గ‌ర్భం దాల్చిన త‌ర్వాత మ‌హిళలు ఆచితూచి అడుగు వేయాలి. ముఖ్యంగా ఆహార విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఇంట్లో పెద్ద‌వాళ్లు ఉంటే వారు నూనె, బ‌ట‌ర్‌ల‌కు బ‌దులుగా నెయ్యినే వాడుతారు. నెయ్యి తింటే మంచిద‌ని ఈ ప‌నిచేస్తారు. మ‌రి గ‌ర్బిణిలు నెయ్యి ఎక్కువ‌గా తింటే ఏం కాదా? ఎవ‌రైనా ఎంతైనా తినొచ్చా? ఎక్కువ‌గా తింటే ఏదైనా స‌మ‌స్య వ‌స్తుందా? తింటే ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న సందేహాలు మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధాలు కింద ఉన్నాయి చ‌దివి తెలుసుకోండి.
* గ‌ర్భిణిలు నెయ్యి తిన‌డం మంచిది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మ‌హిళ ఉండే బ‌రువును బ‌ట్టి నెయ్యి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అధిక బ‌రువు పెర‌గ‌డానికి దారి తీస్తుంది.
* నెయ్యి తిన‌డం వ‌ల్ల ఆహారం తొంద‌ర‌గా అరుగుతుంది. ఇది మెట‌బాలిజంను బూస్ట్ చేస్తుంది.
* గ‌ర్భిణీ మ‌హిళ‌లు రోజుకి 3 టీస్పూన్లు నెయ్యి తింటే స‌రిపోతుంది. అంత‌మించి తీసుకోకుండా చూసుకోవాలి. ఈ లెక్క‌న ప్రెగ్నెన్సీ టైం అంతా హాయిగా ఎలాంటి భ‌యం లేకుండా తినొచ్చు.
* నెయ్యిలో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ ఉన్నాయి. నెయ్యి తినేవారిలో ఈ పోష‌కాల‌న్నీ ల‌భ్య‌మ‌వుతాయి.
* సాధార‌ణంగా క‌డుపులో ఉండే బేబీకి పెరుగుద‌ల ఉండాలంటే.. నాలుగ‌వ నెల నుంచి బిడ్డ పుట్టేవ‌ర‌కు క‌నీసం మూడు వంద‌ల క్యాల‌రీలు ఎక్కువ కావాలి. దీనికి నెయ్యి ఎంతో తోడ్ప‌డుతుంది.
* నెయ్యి తిన‌డం వ‌ల్ల బేబీ మెద‌డు బాగా అభివృద్ది చెందుతుంది.
* ఒత్తిడి స‌మ‌స్య‌లు ఏవైనా ఉంటే నెయ్యి ఇట్టే పోగొడుతుంది. మాన‌సిక మూడ్ నుంచి నార్మ‌ల్ మూడ్‌కు మారుస్తుంది.
* శ‌రీరం గట్టిగా, దృఢంగా ఉండాలంటే నెయ్యి ఎంతో అవ‌స‌రం.
* గ‌ర్భిణీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా నేచుర‌ల్‌గా త‌యారు చేసిన వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా నెయ్యి. ఇంట్లో త‌యారు చేసిన నెయ్యి అయితే శ్రేయ‌ష్క‌రం.
* ఇంట్లో పండించిన కూర‌గాయ‌లు, పండ్లు తింటున్న‌ప్పుడు నెయ్యి తిన్నా మ‌రేం భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. రెండూ బ్యాలెన్స్ అవుతాయి.
* నార్మ‌ల్ డెలివ‌రీ కావాలంటే గ‌ర్భిణీ మ‌హిళ‌లు ఇలా చేయాలి. స్వచ్చమైన ఆవు నేతిని, కాచిన పాలలో కలుపాలి. అందులోనే 2 చుక్కలు కుంకుమ పువ్వు, 4 చుక్కలు తేనె, చిటికెడు పసుపు కలిపి సేవిస్తే.. ఇమ్యూనిటీని బూస్ట్ చేసి, బేబీ బ్రెయిన్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తుంది. ఇది సేఫ్ డెలివరీకి సాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.