DailyDose

మరో నటికి కరోనా-TNI బులెటిన్

మరో నటికి కరోనా-TNI బులెటిన్

* కరోనా పై ఎ.పి. వైద్య అరోగ్యశాఖ మీడియా బులెటిన్ 286 విడుదల.ఏ.పి.లో 24 గంటల్లో కొత్తగా 7,228 కేసులు నమెుదు,దింతొ 6,46,530కు చెరిన కేసులు, రాష్ట్రంలో 24 గంటల్లో 45 మంది మరణించగ ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,506 మంది మరణించారు.విశాఖ జిల్లాలో 24 గంటల్లో 4 గురు మరణించగ, కోత్తగా 414 కేసులు నమెుదు,దింతో జిల్లాలో 47,824 చెరిన కేసులు, ఇప్పటివరకు జిల్లాలో 406 మంది మరణించారు.తుర్పుగోదావరి జిల్లాలో 24 గంటల్లో4 గురు మరణించగ, 1,112 కేసులు నమెుదు,దింతో జిల్లాలో 90,047 చెరిన కెసులు,ఇప్పటివరకు 497 జిల్లాలో మంది మరణించారు.

* కరోనా దాడి తీవ్రత మనలో ఉండే రోగనిరోధకశక్తిపై ఆధారపడి ఉంటుంది. దానితో పాటు వైరస్‌పై పోరాడటానికి శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు కొంతమేర కరోనా సోకకుండా అడ్డుకుంటాయి. ఈ నేపథ్యంలో డెంగ్యూ వచ్చి వెళ్లిన తర్వాత రక్తంలో ఏర్పడే యాంటీబాడీలు కరోనాకు కొంత వరకూ చెక్‌ పెడతాయని బ్రెజిల్‌కు చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది. 2019, 2020లో ఈ వ్యాధి తీవ్రత ఉన్న ప్రదేశాలను పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేసిన బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి కొత్త విషయాలను కనుగొన్నారు. డెంగ్యూతో బాధపడిన సమూహంపై కొవిడ్‌ పెద్దగా ప్రభావం చూపనట్లు గుర్తించారు. దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ.. సార్స్‌ జాతికి చెందిన కరోనా వైరస్‌లలో కొంతమేర పోలికలు ఉన్నట్లు తేల్చారు. దీంతో పాటు డెంగ్యూ నివారణకు వాడే మందులు సైతం కరోనాపై కొంతవరకూ సమర్థంగా పోరాడతాయని ఆయన నిర్ధరించారు.

* రాష్ట్రంలో రోజూ నమోదవుతున్న కోవిడ్‌ కేసుల కంటే డిశ్చార్జ్‌ అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,555 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 24 గంటల్లో 68,829 టెస్టులు చేయగా, 7553 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్‌ కారణంగా 51 మంది మృతి చెందారు.

* దక్షిణ, ఉత్తరాది సినిమా పరిశ్రమల్లో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్‌ నటి జరీనా వహాబ్‌ కూడా కరోనా కారణంగా క్వారెంటైన్‌లో ఉన్నారు. ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారం క్రితం చికిత్స కోసం ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేరారు. జ్వరం, శ్వాస సమస్య, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆమెకి చికిత్స అందించారు డాక్టర్లు. ఆస్పత్రిలో చేరిన ఐదు రోజులకే జరీనా ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే జరీనాకి ఇంకా నెగటివ్‌ రాలేదు. ప్రస్తుతం హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటున్నారామె. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో జరీనా వహాబ్‌ నటించారు. తాజాగా రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘విరాటపర్వం’ చిత్రంలో జరీనా ఓ కీలక పాత్ర చేస్తున్నారు.

* దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా రోగులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఇటీవల కొద్ది రోజుల నుంచి రికవరీల సంఖ్య భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఏకంగా 1,01,468 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 44,97,867కు చేరుకుంది. మరోవైపు కొత్త కేసుల సంఖ్య కూడా ఇటీవల వస్తున్న రోజూవారీ కేసులతో పోలిస్తే తగ్గాయి. మంగళవారం 75,809 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 55,62,663కు చేరుకుంది.