DailyDose

నానిని బర్తరఫ్ చేయాలని భాజపా తీవ్ర ఆందోళన-నేరవార్తలు

నానిని బర్తరఫ్ చేయాలని భాజపా తీవ్ర ఆందోళన-నేరవార్తలు

* రాష్ట్ర మంత్రి కొడాలి నాని ని మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి మంత్రి మండలి నుంచి నానీ నీ బర్తరఫ్ చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు

* ఓ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకోగా, ఆయ‌న భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు చెరువులో దూకారు. ఈ విషాద ఘ‌ట‌న హ‌ర్యానాలోని రోహ‌త‌క్‌లో బుధ‌వారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్ర‌మోద్ ష‌హార‌ణ్(38) స్థానికంగా ఉన్న ఓ న‌ర్సింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ప్ర‌మోద్ భార్య మీనాక్షి కూడా లెక్చ‌ర‌రే. వీరికి ఎన్నా(10), ప్రీశా(4) అనే ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు.

* పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త పై కత్తులతో దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించిఒది.

* గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్లాంటులో గురువారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది.సూరత్ ఓఎన్‌జీసీ ప్లాంటులో గురువారం తెల్లవారుజామున పలుసార్లు పేలుళ్లు జరిగాయి. దీంతో మంటలు అంటుకున్నాయి. మంటలతో పెద్ద ఎత్తున పొగ వస్తోంది. అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన ప్లాంటుకు తరలివచ్చి మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని ఓఎన్‌జీసీ అధికారులు తెలిపారు.

* మద్యానికి బానిసగా మారి. భార్యాపిల్లలను చిత్రహింసలకు గురి చేస్తూ, అమానుషంగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన వికారాబాద్‌ పట్టణం రాజీవ్‌గృహకల్పలో బుధవారం జరిగింది. వికారాబాద్‌ సీఐ రాజశేఖర్‌ తెలిపిన ప్రకారం.. దోమ మండలం ఊటుపల్లికి చెందిన అజిమొద్దీన్‌కు అదే మండలం మోత్కూర్‌కు చెందిన నజీమాబేగంతో 2014లో వివాహం జరిగింది. వీరికి షహనాబేగం(3), హసీనాబేగం(2) సంతానం. వికారాబాద్‌ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తూ రాజీవ్‌గృహకల్పలో అద్దెకు ఉంటున్నాడు. పెళ్లయినప్పటి నుంచి భార్యను నిత్యం వేధింపులకు గురి చేయడం మొదలెట్టాడు. చాలా సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సముదాయించినా ఫలితం లేకపోయింది. పిల్లలు జన్మించాకనైనా మార్పు వస్తుందని భర్త ఆగడాలను ఆ ఇళ్లాలు భరించింది. ఆమె ఆశలు అడియాసలే అయి వేధింపులు తారస్థాయికి చేరాయి. మద్యం తాగి కిల్లీ(పాన్‌) వేసుకుని పిల్లలపై ఊయడం, చితకబాదడం, గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతూ పైశాచిక ఆనందం పొందేవాడు. ఈ సంఘటన పలు వాట్సాప్‌ సముదాయాల్లో(గ్రూపులు) బుధవారం వైరల్‌గా మారింది. భార్య ఫిర్యాదుతో అజిమొద్దీన్‌పై కేసు నమోదు చేశారు. భార్యాపిల్లలకు వికారాబాద్‌ సఖి కేంద్రంలో తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తున్నట్లు నిర్వాహకురాలు అనితారెడ్డి తెలిపారు.

* చీపురుపల్లి బీఎస్​ఎన్​ఎల్ ఆఫీసులో నకిలీ ఆధార్​ కార్డుల ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు.నకిలీ ఆధార్ కార్డుల విషయంపై.. ఎమ్మార్వో ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందేందుకు ఆధార్​ కార్డులో ఉన్న వయస్సును మార్పిడి చేస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు వివరించారు.ఆధార్​ కార్డులో మోసాలకు పాల్పడుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు.వయస్సు మార్చటం కోసం ఒక్కొక్కరి నుంచి 3 వేల నుంచి ఐదు వేల రూపాయలు వసూల్లు.

* ఉద్యోగాల పేరుతో బురిడీ కొట్టిస్తున్న ఘరానా మోసగాడిని చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసిన గోదావరిఖని టూ టౌన్ పోలీసులు:2018 సంవత్సరంలో రాగులపల్లి శంకర్ అనే వ్యక్తి సింగరేణి ఉద్యోగాలు పెట్టిస్తాను అని మాయ మాటలు చెప్పి 11,00000/-ల రూపాయలు తీసుకొని మోసం తీసుకొని మోసం చేశాడు అని శ్రీరాం సారయ్య అనే వ్యక్తి పిర్యాదు చేయడం జరిగింది.