Sports

గవాస్కర్ వ్యాఖ్యలపై అనుష్క ఆగ్రహం

Anushka Sharma Fires On Gawaskar For Double Meaning Comments

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘోర పరాజయాన్ని చవిచూసింది. 97 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పోరులో బెంగళూరు సారథి కోహ్లీ రెండు కీలక క్యాచ్‌లను జారవిడిచాడు. దానికి ఆ జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది. అంతేకాక ఛేదనలో కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. అయిదు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగే చేశాడు. అయితే మ్యాచ్‌లో కోహ్లీ ప్రదర్శనపై వ్యాఖ్యాత గావస్కర్‌ అనుష్కశర్మని ప్రస్తావిస్తూ ద్వందార్థంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో గావస్కర్‌పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విరుష్క అభిమానులు గావస్కర్‌ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో భగ్గమంటున్నారు. అతడిని వ్యాఖ్యాతగా తొలగించాలని బీసీసీఐకి డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ద్వందార్థంతో గావస్కర్‌ వ్యాఖ్యలు చేయలేదని లాక్‌డౌన్‌లో జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ పేర్కొన్నాడని కొందరు నెటిజన్లు అతడిని వెనకేసుకొస్తున్నారు.